ఆర్య సమాజ్ పోరాటంతోనే నిజాం దిగివచ్చాడు : దత్తాత్రేయ

నిజాం రాక్షస పాలనపై తిరుగుబాటు సమయంలో ఆర్య సమాజ్ కీలక పాత్ర పోషించిందన్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఆర్య సమాజ్ పోరాటంతోనే నిజాం దిగివచ్చాడని చెప్పారు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో… హైదరాబాద్ విమోచన దినోత్సవ మహాసభ జరిగింది. బేగంపేటలోని వైదిక ఆశ్రమ కన్యాగురుకులంలో లో నిర్వహించిన సభలో ఉద్యమకారులను సన్మానించారు దత్తాత్రేయ. కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషర్ రెడ్డి, మాజీ ఎంపీ, బీజేపీ నేత జి.వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.

విమోచన దినోత్సవాన్ని పండుగలా జరుపుకునే సమయం వచ్చిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవం గురించి ప్రశ్నించిన కేసీఆర్… ఇప్పుడెందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. MIM కనుసన్నలో టీఆర్ఎస్ పనిచేస్తోందని ఆరోపించారు. అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించేవరకు వదిలిపెట్టేదిలేదన్నారు కిషన్ రెడ్డి. వ్యక్తిత్వ వికాసం గురించి ఆర్య సమాజ్ నేర్పిస్తుందన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. MIMతో పొత్తు పెట్టుకోవడం వల్లే… కేసీఆర్ విమోచన దినోత్సవం జరపడంలేదని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి.