అపాచీలన్నీ వచ్చేసినయ్..!

న్యూఢిల్లీ: అమెరికా కంపెనీ బోయింగ్ నుంచి చివరి విడతగా ఐదు అపాచీ హెలికాప్టర్లను అందుకున్నట్లు ఐఏఎఫ్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. దీంతో మన దగ్గర ఉన్న అపాచీ హెలికాప్టర్ల సంఖ్య 37కు చేరిందన్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లలో అపాచీ ఒకటి.. ఇప్పుడు ఐఏఎఫ్ అందుకున్న హెలికాప్టర్లు ఏహెచ్- 64 ఈ లేటెన్ట్ వెర్షన్ అని చెప్పారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) దగ్గర నెలకొన్న టెన్షన్ల నేపథ్యంలో ఇప్పటికే ఈ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. బార్డర్కు దగ్గర్లోని కీలక ఎయిర్ పోర్టుల్లో వీటిని డిప్లాయ్ చేసినట్లు చెప్పారు.

2015 సెప్టెంబర్లో లేటెస్ట్ మోడల్ అపాచీ హెలికాప్టర్లు (22), చినూక్ మిలటరీ హెలికాప్టర్లు(15) కొనుగోలుకు యూఎస్ కంపెనీ బోయింగ్తో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ హెలికాప్టర్లను విడతల వారీగా ఆ కంపెనీ డెలివరీ చేసింది. చివరి విడత అపాచీ హెలికాప్టర్లను 2 వారాల క్రితమే అప్పగించినట్లు బోయింగ్ ప్రకటించింది. ఇండియాతో పాటు 17 దేశాలు ఈ హెలికాప్టర్ల కోసం తమతో డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలిపింది. కాగా, లేటెస్ట్గా మరో 6 హెలికాప్టర్లను కొనుగోలుకు డీల్ కుదుర్చుకున్నట్లు ఐఏఎఫ్‌ అధికారులు చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

 

Latest Updates