రాష్ట్రంలో కరోనా కేసులు 5,000 దాటినయ్

ఇందులో గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్లో 189.. జిల్లాల్లో 30 కేసులు
వైరస్‌‌తో మరో ఇద్దరు మృతి.. మొత్తం మృతులు 187

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 5 వేలు దాటింది. శనివారం 253, ఆదివారం 237 కేసులు నమోదవగా.. సోమవారం 219 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ 219 కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్‌‌లో 189, మేడ్చల్‌‌లో 2, రంగారెడ్డిలో 13, సంగారెడ్డిలో 2, వరంగల్ అర్బన్‌‌4, మహబూబ్‌‌నగర్ 1, మెదక్ 1, ఆదిలాబాద్‌ 1, యాదాద్రి 1, వరంగల్ రూరల్ 3, వనపర్తి 1, పెద్దపల్లిలో 1 నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,193కు చేరింది. ఇందులో 2,766 మంది వైరస్ నుంచి కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మరో 2,240 మంది ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లలో , ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వైరస్‌తో సోమవారం మరో ఇద్దరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 187కు చేరింది. మరణించిన వారి వివరాలను సర్కార్ వెల్లడించలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates