కవితపై అసభ్యకర పోస్టింగ్ : పోలీసులకు ఫిర్యాదు

దిశ అత్యాచారం,హత్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడంలేదని సోషల్ సైట్లలో విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలి కుటుంబానికి జరిగిన అన్యాయంపై సీఎం కేసీఆర్ స్పందించలేదని ఫేస్ బుక్,ట్విట్టర్ లో నెటిజన్లు తీవ్రంగా ఆరోపించారు. ఈ క్రమంలోనే సీఎం కూతురు మాజీ ఎంపీ కవితపై సోషల్ మీడియాలో కొందరు యువకులు అభ్యంతరకరంగా పోస్టింగ్స్ చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ డాక్టర్ విజయ కేసరి సోమవారం సైబరాబాద్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.

ట్విట్టర్ పోస్టింగ్స్, స్క్రీన్ షాట్స్ ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందించింది. ఈ కేసులో పోస్టింగ్స్ చేసిన వ్యక్తుల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. అనుమానాస్పదంగా జరిగిన పోస్టింగ్స్ పై ఆరా తీస్తున్నారు. ట్విట్టర్ అకౌంట్స్ ఆధారంగా ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ ను గుర్తించినట్టు తెలిసింది. సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితులను అరెస్ట్ చేస్తామని సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు.

Latest Updates