కొత్త ఫ్రాంచైజీ ఇప్పుడే వద్దు!

న్యూఢిల్లీ: ఐపీఎల్​ కొత్త ఫ్రాంచైజీల ఐడియాను పాత ఫ్రాంచైజీలు పెద్దగా అంగీకరించడం లేదు. ఇప్పుడున్న బోర్డు పాలసీ ప్రకారం ఇవి ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నిస్తున్నాయి. ఎనిమిది ఫ్రాంచైజీల్లో మూడు.. ఈ ఐడియాను తప్పుబట్టాయి. 2022లో కొత్త ఫ్రాంచైజీలు ఏర్పాటు చేస్తే అందరికి బాగుంటుందన్నాయి. ‘ఫ్రాంచైజీల సంఖ్య పెరుగుతుందని మాకు ఎవరూ ఇన్ఫర్మేషన్‌‌ ఇవ్వలేదు. మీడియాలో మాత్రమే కథనాలు వస్తున్నాయి. కొత్త టీమ్‌‌లను తీసుకొచ్చే రైట్​ బీసీసీఐకి ఉంది. కానీ ఈ టైమ్‌‌లో తీసుకురావడం కరెక్ట్​ కాదు. కొవిడ్‌‌ వల్ల చాలా దెబ్బతిన్నాం. కాబట్టి వచ్చే ఏడాది కాకుండా 2022లో అయితే ఓకే. మీడియా రైట్స్‌‌కు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని ఓ ఫ్రాంచైజీ ఓనర్‌‌ వెల్లడించాడు. కొత్త ఐడియాను అమలు చేయడానికి టైమ్‌‌ ఎక్కడుందని మరో ఫ్రాంచైజీ ప్రతినిధి ప్రశ్నించాడు. ‘ఏ ఫ్రాంచైజీ దగ్గరకు వెళ్లినా ఇదే ప్రశ్న ఎదురవుతుంది. ఏదో ఓ రోజు ఐపీఎల్‌‌ను ఎక్స్‌‌పాండ్‌‌ చేయాల్సిందే. ఎప్పటికీ ఎనిమిది టీమ్‌‌ల ఎఫైర్‌‌ కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఎక్స్‌‌పాండ్‌‌ చేయడానికి ఇది కరెక్ట్‌‌ టైమ్‌‌ కాదు. పరిస్థితులు కుదుటపడిన తర్వాత అలాంటి ఐడియాలను అమలు చేయాలి. అప్పటివరకు బీసీసీఐ వెయిట్‌‌ చేస్తే బాగుంటుంది’ అని సదరు ప్రతినిధి పేర్కొన్నాడు.

కలిగే నష్టాలివే..

  • అన్ని ఫ్రాంచైజీలకు సెంట్రల్‌‌ ఫూల్‌‌ నుంచి డబ్బులను సమంగా పంచుతారు. రెండు పెరగడం వల్ల ఇందులో కోత పడుతుంది. కొత్త ఫ్రాంచైజీలు రావడం వల్ల పూల్‌‌ రెవెన్యూ పెరుగుతుందని బీసీసీఐ హామీ ఇవ్వాలి. కానీ బోర్డు స్పందించడం లేదు.
  • మెగా ఆక్షన్‌‌ను ఎలా కండక్ట్‌‌ చేస్తారు. ప్లేయర్లందర్ని వేలంలోకి తీసుకురావడం వల్ల ఫ్రాంచైజీల కోర్‌‌ గ్రూప్‌‌ బాగా దెబ్బతింటుంది. వచ్చే సీజన్‌‌కు 4 నెలలే ఉండటంతో కోర్‌‌ గ్రూప్‌‌ను రెడీ చేసుకోవడం కష్టమని ఫ్రాంచైజీల ఆందోళన.
  • కొత్త టీమ్‌‌ వల్ల స్టార్‌‌ ఇండియా కూడా బీసీసీఐకి లైజెనింగ్‌‌ ఫీజు కింద అదనంగా  రూ. 872 కోట్లు చెల్లించాలి. ప్రస్తుతం ప్రతి మ్యాచ్‌‌కు స్టార్‌‌ రూ. 54.5 కోట్లు చెల్లిస్తోంది. కొత్త టీమ్‌‌ వల్ల 16 మ్యాచ్‌‌లు పెరుగుతాయి. కాబట్టి యాడ్​ రేట్​ పెంచడం వర్కౌట్​ కాదని అభిప్రాయం.

క్వాలిటీ కష్టమే..

కొత్త ఫ్రాంచైజీలు రావడం వల్ల నైపుణ్యం కొరత ఏర్పడుతుందని మూడో ఫ్రాంచైజీ ఆవేదన వ్యక్తం చేసింది. టీమ్స్‌‌ అన్ని డైల్యూట్‌‌ అవుతాయని చెప్పింది. ఫ్రాంచైజీలను పెంచే ముందు బీసీసీఐ చాలా పాలసీలను మార్చాల్సి వస్తుందని, ఇందుకు బోర్డు సిద్ధంగా ఉందో లేదో తెలియదని తెలిపింది. ప్రస్తుతం ఉన్న పాలసీ ప్రకారం ప్రతి టీమ్‌‌లో 18–25 మంది ప్లేయర్లు ఉంటారు. ఇందులో ఎనిమిది మంది ఓవర్‌‌సీస్‌‌ ప్లేయర్లకు చాన్స్‌‌ ఉంటుంది. అయితే ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో మాత్రం నలుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే బరిలోకి దిగాల్సి ఉంటుంది. మిగతా 7 గురు ఇండియన్‌‌ ప్లేయర్లు ఆడతారు. ‘టీమ్స్‌‌ పెరగడం వల్ల క్వాలిటీ ఉండదు.  నైపుణ్యం ఉన్న ప్లేయర్లు తగ్గిపోతారు.స్క్వాడ్స్‌‌లో 7 నుంచి 9 మంది కోర్‌‌ గ్రూప్‌‌ ప్లేయర్లే ఉంటారు. బ్యాలెన్స్‌‌ కోసం మిగతా ఇద్దరు, ముగ్గుర్ని రొటేట్‌‌ చేస్తుంటారు. ఈ టైమ్‌‌లో ఫ్రాంచైజీలను పది చేశారంటే అటోమెటిక్‌‌గా టీమ్స్‌‌ డైల్యూట్‌‌ అయిపోతాయి. కోర్‌‌ గ్రూప్‌‌ను మెయింటేన్‌‌ చేయడానికి ప్రతి ఏడాది సాలరీ పర్స్‌‌ను పెంచుతుంటారు. వ్యక్తిగతంగా కూడా కొంత ఖర్చు చేస్తుంటాయి. అందుకే ప్రతి టీమ్‌‌ కోర్‌‌ గ్రూప్‌‌ ఏదో ఓ దశలో సమానంగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు రెండు కొత్త ఫ్రాంచైజీలు రావడం వల్ల కోర్‌‌ గ్రూప్‌‌, ఆట మొత్తం డైల్యూట్‌‌ అవుతుంది’ అని మూడో ఫ్రాంచైజీ తెలిపింది.

Latest Updates