పాఠాలు చెప్పే పిలగాడు

15 ఏళ్ల పిల్లలంటే ఆడుతూ పాడుతూ సరదాగా గడుపుతారు. సినిమాలు, షికార్లతో జాలీగా ఉంటారు. కానీ, మహారాష్ట్రకి చెందిన వరద్ మాత్రం పదిహేనేళ్లకే సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడు. పక్షుల్ని, ప్రకృతిని కాపాడాలంటూ పాఠాలు కూడా చెప్తున్నాడు. కొన్ని వేల వలస పక్షుల ప్రాణాలు కాపాడుతున్నాడు. చిన్నవయసులోనే ఎందరినో ఇన్‌ స్పైర్ చేస్తు న్న వరద్ గురించి మరిన్ని విషయాలు..

మహారాష్ట్రలోని అచ్రా గ్రామానికి చెందిన వరద్ కి చిన్తనం నుంచి పక్షులంటే చాలా ఇష్టం . తన ఇల్లు కొబ్బరితోటకి దగ్గరగా ఉండటంతో అక్కడికొచ్చే రకరకాల పక్షుల్ని చూస్తూ వాటితో ఎప్పుడూ ఆడిపాడుతుండేవాడు. తన తాతతో కలిసి పక్షుల కోసం కొబ్బరితోటలోనే గంటలు గంటలు గడిపేవాడు. టైమ్‌ కు నీళ్లు, గింజలు అందిస్తూ పక్షుల ప్రతి అవసరాన్ని తీర్చేవాడు. కానీ, వరద్ చదువుని దృష్టిలో ఉంచుకుని వాళ్ల అమ్మానాన్న దగ్గర్లోని టౌన్ కి షిఫ్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. దాంతో ఆ పరిసరాల్ని బాగా మిస్ అయ్యాడు వరద్. ఆ కొబ్బరి తోటలోని పక్షుల కిలకిలలు గుర్తొచ్చి ప్రతి వీకెం డ్ అక్కడికెళ్లి టైం స్పెండ్ చేసేవాడు. పెరిగిపె ద్దవుతున్నకొద్దీ పక్షులపై, ప్రకృతిపై ఆ ఇష్టం మరింత పెరి గింది వరద్ కి. కానీ, అనుకోకుం డా జరిగి న ఓ సంఘటన ఈ పక్షి ప్రేమికుడ్ని ఎన్విర్మాం టలిస్ట్​ని చేసింది.

అలా మొదలైంది

వీకెండ్ లో సరదాగా ఆచ్రా బీచ్ కె ళ్లి కూర్చొని విదేశాల నుం చి వలసొచ్చి న పక్షుల్ని ఫొటోలు తీస్తున్నాడు వరద్ . అతను చూస్తుండగానే కాకులు ఆ వలస పక్షులపై దాడి చేయడం మొదలుపెట్టా యి. వాటి బారి నుంచి తప్పించుకోవడం వలస పక్షుల వల్ల కాలేదు. దాంతో వరద్ కలగజేసుకుని కాకుల గుం పుని అక్కడ్నుం చి పంపించేశాడు. ఒళ్లంతా గాయాలతో ఉన్న పక్షుల్ని తన ఇంటికి తీసుకె ళ్లి ట్రీట్మెం ట్ చేయిం చాడు. తనకి ఆ పక్షుల గురించి అంతగా తెలియకపోవడంతో ఇంటర్నెట్ సాయంతో అవి పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చిన బ్రిడ్ లిడ్ పక్షులని అవి మాస్ సూ న్ సీజన్ లో మనదేశంలోని సముద్రతీరాలకు వలస వస్తాయని తెలుసు కున్నాడు. వాటికి పూర్తిగా నయమయ్యే వరకు అవసరమైన సేవలన్నీ చేశాడు. అప్పట్నుం చి వలస పక్షుల్ని, లోకల్‌ పక్షుల్ని కాపాడటాన్ని ఒక మిషన్ గా పెట్టుకున్నాడు వరద్ . తన చుట్టు పక్కన ఏరియాల్లో గాయపడ్డ పక్షుల్ని వెతికి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటిదగ్గర వాటికోసం ప్రత్యేకంగా గూళ్లు ఏర్పాటు చేశాడు. పక్షుల కేర్ గురించి స్కూల్స్ , కాలేజీలు తిరుగుతూ పాఠాలు కూడా చెప్తున్నాడు. పక్షులకి అవసరమైన పండ్లు, మొక్కలు కూడా తన గార్డెన్ లో సాగు చేస్తున్నాడు.

సీడ్ ఎగ్

వరద్ ఇంటి వెనక ఆవరణలో వందల కొద్ది ఎగ్ షెల్స్ అమర్చాడు. వాటిపై సిం హం, మిక్కిమౌస్, తాబేలు లాంటి బొమ్మలు గీసి వాటిల్లో గింజలు పోస్తున్నాడు. మీకు దగ్గర్లోని చెట్టు పొదల్లో, గింజలతో ఉన్న ఎగ్ షెల్స్ ను పెట్టం డి అంటూ పిల్లల్ని, ట్రావెలర్స్ ని రిక్వెస్ట్‌ చేస్తున్నాడు.  కార్యక్రమానికి ‘సీడ్‌ ఎగ్‌’ అనే పేరు పెట్టాడు.

Latest Updates