హాస్పిటల్ పై నుంచి దూకి కరోనా పేషెంట్ సూసైడ్

హైదరాబాద్‌‌ (మాదాపూర్), వెలుగు: కరోనా ఆస్పత్రిలో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్న ఓ వ్యక్తి హాస్పిటల్‌‌ రెండో ఫ్లోర్‌‌ నుంచి దూకి సూసైడ్‌‌ చేసుకున్నారు. హైదరాబాద్‌‌లోని మాదాపూర్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. వేములవాడకు చెందిన నారాయణ (77)  కొన్నేండ్లుగా కుటుంబీకులతో కలిసి కొండాపూర్‌‌లో ఉంటున్నాడు. ఈ నెల 13న ఆయనకు జ్వరం, దగ్గు రావడంతో కుటుంబీకులు కొండాపూర్‌‌లోని కిమ్స్​ ఆస్పత్రిలో చేర్పించారు. కరోనాగా తేలడంతో ట్రీట్‌‌మెంట్‌‌ స్టార్ట్‌‌ చేశారు. రెండ్రోజులుగా ట్రీట్‌‌మెంట్‌‌కు ఆయన సహకరించడం లేదని డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్‌‌లో ఉండలేనని, ఇంటికి పంపించాలని వైద్య సిబ్బందిని ఆదివారం నారాయణ పదే పదే కోరడంతో కుటుంబీకులకు ఇన్ఫర్మేషన్‌‌ అందించారు. వాళ్లు ఆస్పత్రికి వచ్చే లోపే నారాయణ పొద్దున 9.55 గంటలకు హాస్పిటల్‌‌ రెండో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

Latest Updates