ఎస్పీ బాలుకి కరోనా..వీడియో రిలీజ్

కరోనా  ఏ ఒక్కరినీ వదలడం లేదు. సినీ,రాజకీయ,క్రీడాకారులు అందరు కరోనా బారిన పడుతున్నారు. లేటెస్ట్ గా టాలీవుడ్ ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు.  రెండు మూడు రోజుల నుంచి అస్వస్థగా ఉండటంతో ఆస్పత్రిలో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. డాక్టర్లు హోం క్వారంటైన్ లో ఉండమని చెప్పారన్నారు. అయితే కుటుంబ సభ్యులకు ఇబ్బంది కల్గకూడదని ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు చెప్పారు. కేవలం దగ్గు ,జలుబు ఉన్నాయన్నారు. ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగా ఉన్నానన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ లో ఓ వీడియో రిలీజ్ చేశారు.

Posted by S. P. Balasubrahmanyam on Tuesday, August 4, 2020

Latest Updates