జల్సాల కోసం చోరీలు..ముగ్గురు యువకులు అరెస్ట్

జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. డిటెక్టివ్ ఇన్ స్పె క్టర్ జగదీశ్వర్ రావు వివరాల ప్రకారం..లాలాపేట, ఇందిరా నగర్ లో నివసించే ఆర్.బాలాజీ(23) చాట్ బండార్  డుపుతుంటాడు.ప బ్బరాకేష్ (24) హోటల్లో పనిచేస్తుంటాడు.పూర్ణ శివకుమార్(21) సేల్స్ బాయ్. ముగ్గురుస్నేహితులు. జల్సాలకు అలవాటు పడి చోరీలు చెయ్యడం మొదలుపెట్టారు. గతేడాది జనవరిలో మల్కాజిగిరి మల్లిఖార్జుననగర్ లో ఉదయం వేళలో పాల ప్యాకెట్లు తీసుకువచ్చే వ్యానులో గుట్టు చప్పుడు కాకుండా రూ.48 వేలున్న బ్యాగును ఎత్తుకెళ్లారు. 4 నెలలుగా మధ్యాహ్న సమయంలో షట్టర్లను సగానికి దించేసిన దుకాణాలను టార్గెట్ చేసి మల్కాజిగిరి పరిధిలో సుమారు 10 షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మల్కాజిగిరి పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. శనివారం ముగ్గురిని అదుపులోకి తీసుకుని బైకును స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్ కు తరలించామని డీఐ జగదీశ్వర్ రావు తెలిపారు.

 

Latest Updates