నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన పోలీసులు

హైదరాబాద్: ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి పోలీసులు మంచి మనసును చాటుకున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుల వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. మూడు రోజుల క్రితం బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓం నగర్ లో నివాసం ఉంటున్న ఓ కుటుంబ ఇంటిపై కప్పు కూలిపోయింది. పోలీసుల విచారణలో ఇంటి పెద్ద అయిన తల్లి వితంతువు కాగా , ఆమె కూతుళ్లు ఒకరు వితంతువు , మరొకరు అవివాహితలుగా ఉన్నట్లు తేలింది.

ఇంటి పైకప్పు పునరుద్ధరించే ఆర్థిక స్థోమత వారికి లేకపోవడంతో.. బేగంబజార్ పోలీస్ సిబ్బంది పెద్ద మనసుతో వారికి అండగా నిలిచారు. సిబ్బంది అందరూ కలిసి కొంత నగదును జమ చేసి ఆ కుటుంబానికి అందజేశారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లామని ,కూలిపోయిన పైకప్పు పునరుద్ధరణకు సహకరించాలని కోరినట్లు సిఐ మదన్ మోహన్ తెలిపారు.

Latest Updates