ఏనుగు క్రాకర్స్‌ ఉన్న కొబ్బరికాయ తినింది: అధికారులు

  • అడవి పందుల కోసం పెట్టిన దాన్ని తినిందని క్లారిటీ
  • బాంబులు తయారు చేసిన ఇద్దరి కోసం వెతుకుతున్న పోలీసులు

తిరువనంతపురం: కేరళలో చనిపోయిన ఏనుగు క్రాకర్స్‌ పెట్టిన కొబ్బరి కాయ తినిందని మన్నర్‌‌కాడ్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌‌ సునీల్‌ కుమార్‌‌ చెప్పారు. జంతువుల నుంచి పొలాలను కాపాడుకునేందుకు గ్రామస్థులు ఇలాంటివి పెడతారని, పొరపాటున దాన్ని తినిందని అన్నారు. ఆకలితో వచ్చిన ఏనుగు కొబ్బరికాయను పగలగొట్టి బాంబులను తినిందని, అందుకే దెబ్బలు తగిలాయని ఆయన అన్నారు. కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేశామని, నిందితుడిని ఘటనాస్థలంలోకి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నామని ఆయన అన్నారు. బాంబు తయారీలో మరో ఇద్దరు కూడా ఉన్నారని, వాళ్ల కోసం గాలిస్తున్నట్లు ఫారెస్ట్‌ ఆఫీసర్‌‌ అలీ చెప్పారు. నదిలోకి దిగేముందు ఏనుగు చాలా రోజులు బయట తిరిగిందని, దాదాపు 20 రోజుల క్రితమే దెబ్బ తగిలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. నొప్పి తట్టుకోలేక చివరికి నదిలోకి దిగి అక్కడే ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. కాగా గర్భంతో ఉన్న ఏనుగు ఆకలితో గ్రామంలోకి వస్తే పైనాపిల్‌లో పటాకులు పెట్టి తినేందుకు ఇచ్చారని ఇప్పటి వరకు అందరూ అనుకన్నారు. కేరళలోని మలప్పురం దగ్గర్లోని ఓ గ్రామంలో గర్భంతో ఉన్న ఏనుగు నోటికి దెబ్బలు తగలడంతో తట్టుకోలేక నదిలోకి దిగి అక్కడే ప్రాణాలు వదిలింది.

Latest Updates