భారీగా పెరిగిన ఫ్లాట్ ఫాం టికెట్ ధర

బతుకమ్మ, దసరా పండుగలను క్యాష్ చేసుకుంటుంది రైల్వే. ఎన్నడూలేని విధంగా ఫ్లాట్ ఫాం టికెట్ ధరను పెంచింది. దసరా సెలవుల రద్దీ దృష్ట్యా పలు రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ ధర తాత్కాలికంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది సౌత్ సెంట్రల్ రైల్వే. శనివారం నుంచి అక్టోబర్- 10 వరకు ఫ్లాట్ ఫాం టికెట్ ను రూ.30కు విక్రయించనుంది. సాధారణంగా ఫ్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 ఉండగా..ఫెస్టివల్ సందర్భంగా రూ.30కి పెంచింది. గతంలో రూ.20 చేయగా..ఈ సారి ఏకంగా రూ.30 చేసింది.

ఈ కింది స్టేషన్లలో ఈ రేటు పెంచినట్లు తెలిపింది రైల్వే

హైదరాబాద్

సికింద్రాబాద్

కాచిగూడ

విజయవాడ

రాజమండ్రి

నెల్లూరులో పెంచిన ధర శనివారం నుంచి అమలు అయ్యింది.

Latest Updates