క్వింటాల్ మిర్చి రూ.20,021

ఖమ్మం టౌన్​,  వెలుగు: ఖమ్మం కోల్డ్​ స్టోరేజీలో ఉన్న తేజ మిర్చి ఆల్​టైం రికార్డ్​ ధర పలికింది. వ్యాపారులు క్వింటాల్​ మిర్చిని రూ.20,021కి కొనుగోలు చేశారు. వారం రోజులుగా మిర్చికి విపరీతమైన డిమాండ్​ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కోల్డ్​ స్టోరేజీలో నిల్వ ఉంచిన మిర్చిని వ్యాపారులు అధిక ధరకు కొన్నారు. సుమారు 150 బస్తాలను కొనుగోలు చేశారు. మరో రెండు రోజులు మిర్చికి ఇదే డిమాండ్​ ఉండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు

Latest Updates