రాష్ట్రంలో భారీగా పడిపోయిన టమాట ధర

హైదరాబాద్: రాష్ట్రంలో టమాట ధర భారీగా పడిపోయింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర కాదు కదా… కనీసం ఖర్చులు కూడా మిగలటం లేదు. దీంతో రాష్ట్రంలో టమాటా రైతులు దారుణంగా నష్టపోతున్నారు. మొన్నటి వరకు బాగానే ఉన్న ధరలు ఒక్కసారిగా పడిపోవటంతో… రైతుల నోట మాట రావడం లేదు. దీంతో మార్కెట్ లో ప్రస్తుతం కేజీన్నర టమాట కేవలం 10 రూపాయలకే అమ్ముడవుతోంది.

క్వింటా టమాటాకు 900 దక్కితే రైతుకు గిట్టుబాటవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ లో వంద రూపాయలు మాత్రమే వస్తుండటంతో… రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నెల మొదటి వారంలో టమాటా కేజీ 12 రూపాయలు పలకగా… ప్రస్తుతం 2 నుంచి 4 రూపాయలకు మాత్రమే కొంటున్నారు.  రాష్ట్రంలో దాదాపు  40 వేల ఎకరాల్లో టమాటా పంటను … యాసంగి సీజన్ లో సాగుచేశారు రైతులు. అయితే పెట్టుబడి పోయినా… కనీసం కూలీల ఖర్చు కూడా రావటం లేదంటున్నారు రైతులు.. దీంతో టామాటాలు కోయకుండా పంటను పోలాల్లోనే వదిలేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్ లో  రైతుల నుంచి బాక్సుకు 40 నుంచి 60 రూపాయలు ఇచ్చి కొంటున్నారు వ్యాపారులు. ఎకరం టమాటా కోయటానికి 8 మంది కూలీలూ అవసరం, ఒక్కోక్కరికి 330 రూపాయలు కూలీ ఇచ్చి కాయలు కొస్తే కనీసం కూలీ డబ్బులు కూడా రావడం లేదంటున్నారు రైతులు. కూలీ డబ్బులు కూడా రాకపోవటంతో టమాటాలు కోయకుండా వదిలేస్తున్నారు రైతులు.

Latest Updates