బకాయి డబ్బు కట్టలేదని.. చనిపోయి 24 గంటలైనా శవాన్నిఇవ్వ లేదు

హైదరాబాద్: చందానగర్ లోని పీఆర్కే హాస్పిటల్ లో ఐదు లక్షలు బిల్లు కడితే తప్ప మృతదేహాన్ని ఇవ్వమని అన్నారని, మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చిట్కుల్ గ్రామానికి చెందిన రాకేష్ బాబు వారం రోజుల క్రితం ప్రమాదంలో గాయపడి పీఆర్కే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని మృతుడి కుటుంబసభ్యులు చెప్పారు. నిన్న రాత్రి చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో రాత్రి కన్నుమూశాడు. ఇప్పటికే ఏడు లక్షల రూపాయలు ఆసుపత్రి బిల్లు కట్టినా మృతుని బంధువులకు ఆస్పత్రి యాజమాన్యం మరో ఐదు లక్షలు ఇవ్వాలని పట్టుపడుతోందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. డబ్బు కడితే గానీ మృతదేహాన్ని ఇవ్వమన్నారని ఆసుపత్రి వద్ద మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. హాస్పటల్ బిల్లు కట్టనందుకు చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉందని రిపోర్ట్ సృష్టించారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

Latest Updates