ఈ నెల 22న బ్యాంక్‌‌ లు బంద్

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంక్‌‌ల యూనియన్లు ఈ నెల 22న(మంగళవారం) బంద్‌‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ బ్యాంక్‌‌ల విలీనాలను నిరసిస్తూ ఈ బంద్ పాటించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఆల్‌‌ ఇండియా బ్యాంక్‌‌ ఎంప్లాయీ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్‌‌ఐ), ఆల్‌‌ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ)లు బ్యాంక్‌‌ల బంద్‌‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌‌తో తమ బ్యాంక్‌‌ బ్రాంచ్‌‌లు ప్రభావితం కానున్నాయని బీఓబీ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. ఇండియా మొత్తం మీద బీఓబీకి 9500 బ్రాంచ్‌‌లున్నాయి. ఈ బంద్ ఎఫెక్ట్‌‌ తక్కువ స్థాయిలోనే ఉంటుందని ఎస్‌‌బీఐ చెప్పింది. బంద్‌‌లో పాల్గొనేందుకు యూనియన్లలో మెంబర్‌‌‌‌షిప్‌‌ ఉన్న తమ బ్యాంక్ ఎంప్లాయీస్ సంఖ్య తక్కువగా ఉందని పేర్కొంది. ఈ కారణంతో ఎఫెక్ట్‌‌ తక్కువ స్థాయిలో ఉంటుందని ఎస్‌‌బీఐ చెప్పింది.

Latest Updates