లక్ష దీపాలు.. ల‌క్ష‌ లడ్డూలు

అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. సరయూ నదీ తీరాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు పంపిణీ చేసేందుకు లడ్డూలను తయారు చేశారు.
లోకల్స్ కు పంపిణీ..
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భూమి పూజ తర్వాత అతిథులకు, అయోధ్యలోని లోకల్స్ కు లడ్డూలు పంపిణీ చేయనుంది. ఇందుకోసం 1,11,000 లడ్డూలను తయారు చేయించింది. ఒక్కో ప్యాకెట్ లో నాలుగు లడ్డూల చొప్పున అందజేయనుంది. ఢిల్లీలోని అన్ని దేశాల ఎంబసీలకూ లడ్డూలను పంపించనుంది.

నదీ తీరం.. సుందరం

సరయూ నదీతీరాన్ని సర్వాంగా సుందరంగా అలంకరించారు. ‘రామ్ కి పైడి’ ఘాట్ ను విద్యుత్ దీపాలు, ముగ్గు లతో డెకరేట్ చేశారు. భూమి పూజ సందర్భంగా బుధవారం దాదాపు లక్ష మట్టి దీపాలను ఇక్కడ వెలిగిస్తారు. ఫైజాబాద్లోని రాంమనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ స్టూడెంట్లు, కొన్ని ఎన్జీవోల వలంటీర్లు ఈ ఏర్పాట్లు చేశారు.

175 మంది అతిథులు

భూమి పూజకు 175 మంది అతిథులను పిలిచినట్లు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. వీరిలో 135 మంది ఇండియా, నేపాల్ లోని 36 ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన సాధువులు ఉన్నారని చెప్పారు. ప్రధాని మోడీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, నృత్య గోపాల్ దాస్ మహరాజ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్,సీఎం యోగి మాత్రమే స్టేజీ మీద ఉంటారట.
సాధువులకు వెండి కాయిన్స్
భూమి పూజకు హాజరు కానున్న సాధువులందరికీ వెండి నాణేలు బహూకరించనున్నారు. ఈ సిల్వర్ కాయిన్స్ ను తమిళనాడులోని కంచి కామకోటి పీఠం.. అశోక్ సింఘాల్ ఫౌండేషన్ పేరు మీద శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు పంపించింది. వీహెచ్ పీ మాజీ ప్రెసిడెంట్, దివంగత అశోక్ సింఘాల్ మేనల్లు డు సలీల్ సింఘాల్ భూమి పూజకు హాజరు కానున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates