బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సుసైడ్ కి ముందు ఏం జరిగింది

బాలీవుడ్ స్టార్ హీరో, ఎంఎస్ ధోని ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. అయితే రాజ్ పుత్ ఆత్మహత్యపై విచారణ చేపట్టిన పోలీసులు కొన్ని ఆధారాల్ని సేకరించారు. పోస్ట్ మార్టం తరువాత ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనే విషయం వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది

ఆత్మహత్యకు ముందు రాజ్ పుత్ ఎలా ఉన్నారు

ఆత్మహత్యకు ముందు ఎప్పుడు ప్రశాంతంగా ఉండే రాజ్ పుత్ కోపంగా ఉన్నారని ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఇండియా టుడేకి తెలిపారు. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం..శనివారం రాత్రి రాజ్ పుత్ తో పాటు అతనితో పాటు ఓ స్నేహితుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం 10గంటల ప్రాంతంలో ఓ గ్లాస్ జ్యూస్ తాగిన రాజ్ పుత్ వెంటనే తన బెడ్ రూమ్ లోకి వెళ్లినట్లు ఆయన పని మనుషులు పోలీసులకు తెలిపారు.

కొద్దిసేపటి తరువాత ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ రాజ్ పుత్ ను పిలవగా స్పందించలేదు. దీంతో ఇంట్లో పని మనుషులు రాజ్ పుత్ బెడ్ రూమ్ డోర్ ను ఓపెన్ చేసేందుకు స్థానికంగా ఉన్న కీ మేకర్ ను పలిపించారు. అలా ఆదివారం మధ్యాహ్నం 12: 30 నుంచి 12: 45గంటల సమయంలో డోర్ ఓపెన్ చేసి చూడగా సుశాంత్ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో భయాందోళనకు గురైన సెక్యూరిటీ అంబులెన్స్ కి పోన్ చేసి..రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నారంటూ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజ్ పుత్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఆత్మహత్యకు ముందు కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు 

విచారణలో భాగంగా రాజ్ పుత్ మరణానికి ముందు ఏం జరిగిందనే విషయం పై కాల్ డేటాను పరిశీలించగా ..సుశాంత్ చివరిసారిగా అర్ధరాత్రి సమయంలో ఓనటుడి ఫోన్ చేసినట్లు అటునుంచి ఎటువంటి సమాధానం రాలేదని తేలింది. ఆదివారం ఉదయం  9.30 గంటల సమయంలో సుశాంత్ తన సోదరితో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు.

సుశాంత్ అంతిమ కల అదేనా

వ్యోమగామి కావాలన్న అంతిమ కలను సాకారం చేసుకోవడానికి పైలట్ కావడానికి సుశాంత్ శిక్షణ పొందాడు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో బ్లాక్ కలర్ నేషనల్ స్పేస్ యూనివర్సిటీకి చెందిన టీషర్ట్ ధరించినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో సుశాంత్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు లాక్ డౌన్ తో షూటింగ్ లు ఆగిపోవడం, మరోవైపు అతని మాజీ మేనేజర్ దిషా సాలియన్ ఆత్మహత్య చేసుకోవడం,  దాదాపు ఆరు నెలలుగా ఫేస్ బుక్, ట్విటర్ కు దూరంగా ఉంటోన్న ఆయన.. తల్లిని తలుచుకుంటూ వారం కిందట ఇన్‌స్టాలో  ఓ కవిత రాశారు.

అస్పష్టమైన గతం.. కన్నీటిచుక్కల మాదిరిగా ఆవిరైపోతోంది.. అంతులేని కలలెన్నో.. చిరునవ్వును అందంగా చెక్కుతోన్న భావన.. క్షణభంగురమైన జీవితంలో ఆ రెండిటికీ మధ్య ఏదో రాయబారం నడుస్తోందే అమ్మా” అంటూ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తనలో సాగిన అంతర్మథనాన్ని కవిత రూపంలో రాయడంపై ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో పై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Latest Updates