గ్రూప్-4 రిక్రూట్‌మెంట్ రెండేండ్లయినా తేల్తలే!

2018 జూన్ లో 1,595 పోస్టులకు నోటిఫికేషన్
ఏడాదిగా కొనసాగుతున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్
ఫైనల్ రిజల్ట్స్ కోసం క్యాండిడేట్ల ఎదురుచూపులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రూప్–4 పోస్టుల రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ రెండేండ్లయినా పూర్తికాలేదు. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినంక, ఏడాది నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ విడతల వారీగా కొనసాగుతూనే ఉంది. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయి ఇక ఫైనల్ రిజల్ట్స్ వస్తాయనుకునే సమయంలో మరో వెయ్యి, రెండు వేల మందిని కొత్తగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలుస్తున్నారని క్యాండిడేట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చినంక తొలిసారి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2018
జూన్ 2న టీఎస్‌పీఎస్సీ 1,595 గ్రూప్–4 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 1,098 జూనియర్ అసిస్టెంట్స్ , 437 టైపిస్టు, 47 జూనియర్స్టెనో, 13 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లను కోరింది. జీహెచ్ఎంసీలో 124 బిల్ కలెక్టర్, బేవరేజెస్కార్పొరేషన్లో 76, ఆర్టీసీలో ర్టీ 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కూడా వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చింది.
ఆర్టీసీ, బేవరేజెస్‌లో పోస్టింగ్ ఇయ్యలే..
గ్రూప్–4, జీహెచ్ఎంసీ, బేవరేజెస్, ఆర్టీసీలోని పోస్టులన్నింటికీ కామన్ సిలబస్తో 2018 అక్టోబర్ 7న ఎగ్జామ్ నిర్వహించారు. మొత్తం 1,867 పోస్టులకు సుమారు 6 లక్షల మంది పరీక్ష రాయగా..టీఎస్పీఎస్సీ 2,72,132 మందితో జనరల్ ర్యాంకింగ్ లిస్టును 2019 మార్చి 20న రిలీజ్ చేసింది . జీహెచ్ఎంసీలో బిల్ కలెక్టర్స్ గా సెలక్టయిన 124 మందికి ఈ ఏడాది మార్చిలో పోస్టింగ్
ఇచ్చారు. ఇక ఆర్టీసీ, బేవరేజెస్ కార్పొరేషన్‌లోని పోస్టులకు ఎంపిక లిస్టునూ మార్చిలోనే ప్రకటించారు. ఈ 148 మందికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.

ఇప్పటికే ఐదుసార్లు వెరిఫికేషన్…
రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత 1,595 గ్రూప్–4 పోస్టులకు 1:5 రేషియోలో 7,598 మందిని పోయినేడాది సెప్టెంబర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలిచారు. ఫస్ట్ స్పెల్ వెరిఫికేషన్ పూర్తయ్యాక, ఈ ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు సెకండ్ స్పెల్ లో మరో 2,063 మందిని వెరిఫికేషన్‌కు పిలిచారు. మార్చి 4 నుంచి 7 వరకు నిర్వహించిన థర్డ్ స్పెల్ కు మరో 1,247 మందిని పిలిచారు. ఈ మూడు స్పెల్స్ పూర్తయ్యాక టెక్నికల్ స్కిల్స్ అవసరమైన 7,454 మందికి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్
(సీపీటీ) మార్చి 8న నిర్వహించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, సీపీటీ కంప్లీట్ కావడంతో ఫైనల్ రిజల్ట్స్ వస్తాయని క్యాండిడేట్లు ఎదురుచూస్తుండగా.. టీఎస్‌పీఎస్సీ మరోసారి జులై మొదటి వారంలో ఫోర్త్ స్పెల్ వెరిఫికేషన్ కు 85 మందిని, అదే నెల 28 నుంచి 30 వరకు నిర్వహించిన ఫిఫ్ల్కు మరో 59 మందిని పిలిచింది. ఇలా వెరిఫికేషన్ జరిగిన ప్రతిసారీ క్యాండిడేట్లు అందరూ వెబ్ ఆప్షన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ ఆదేశించింది.

Latest Updates