రూ.2కోట్ల లంచం తీసుకుంటూ దొరికిన రిజిస్ట్రార్‌

the-registrar-of-the-department-of-cooperation-was-caught-to-the-acb

విశాఖ జిల్లాలో ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రూ.2కోట్ల లంచం తీసుకుంటూ సహకార శాఖ రిజిస్ట్రార్‌ మల్లికార్జునరావు అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు చిక్కాడు. లబ్ధిదారుడి దగ్గర రూ.2కోట్ల లంచం డిమాండ్‌ చేసి అడ్డంగా పట్టుబడ్డాడు. మల్లికార్జునరావు న‌గ‌దుకు బ‌దులు భూమి రిజిస్ట్రేష‌న్ చేయించుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు. త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చిన ఓ వ్య‌క్తి నుంచి రూ.2కోట్లు లంచం డిమాండ్ చేశాడు. అది కూడా న‌గ‌దు రూపంలో కాకుండా భూమి రిజిస్ట్రేష‌న్ కి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. బాధితుడి స‌మాచారంతో ACB అధికారులు విశాఖ టర్నర్ ఛౌల్ట్రీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ భూ రిజిస్ట్రేషన్ సమయంలో వలపన్ని పట్టుకున్నారు.

Latest Updates