రెచ్చిపోయిన దొంగలు.. సికింద్రాబాద్ లో భారీ చోరీ

సికింద్రాబాద్ అల్వాల్లో దొంగలు రెచ్చిపోయారు. లోతుకుంటలోని లక్ష్మీనగర్లో ఒకే రోజు 4 ఇళ్ళల్లో చోరీలు చేశారు. సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లడంతో చేతివాటం చూపించారు దొంగలు.  ఊళ్ల నుంచి ఇంటికి వచ్చి చూసుకునే లోపే దొంగతనం జరిగిందని చెబుతున్నారు బాధితులు.  4 ఇళ్లలో 19 తులాల బంగారం, 3 లక్షల నగదుతో పాటు వెండి వస్తువులు కూడా పోయాయని చెప్తున్నారు.  బాధితుల కంప్లైంట్ తో  పోలీసులు క్లూస్ టీమ్ తో  ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాలనీల్లోని సీసీ టీవీ పుటేజ్ ను చూశారు పోలీసులు.

అటు  మీర్ పేటలోనూ  దొంగలు రెచ్చిపోయారు . మీర్ పేట్  పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడలో  వరుసగా 7 ఇళ్లలో  దొంగతనం చేశారు. పండుగకు ఊరెళ్లిన సమయంలో ఇంటి  తాళాలు పగులగొట్టి  దొంగతనాలు చేశారని చెప్తున్నారు   బాధితులు. ఇంట్లో   ఉన్న బంగారం, నగదు  దోచుకెళ్లారని చెప్పారు. బాధితుల  ఫిర్యాదుతో  ఘటనా స్థలాన్ని  పరిశీలించి  క్లూస్ టీంతో ఆధారాలు  సేకరిస్తున్నారు పోలీసులు.

Latest Updates