పోలీసులమంటూ నగల వ్యాపారిని బెదిరించి బంగారంతో జంప్..

పోలీసుల మంటూ ఓ నగల వ్యాపారిని బెదిరించి బంగారం, నగదుతో జంప్ అయ్యారు ఇద్దరు దొంగలు. ఈ ఘటన పాతబస్తీలో జరిగింది. వెస్ట్ బెంగాల్ కు చెందిన సమంత్ పాతబస్తీలో బంగారు అభరణాల తయారీ వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి  ఇద్దరు వ్యక్తులు వచ్చి ఓ కేసులో విచారించాలని చెప్పి సమంథ్ ను బైక్ పై తీసుకెళ్లారు. మాదన్నపేట దగ్గరలో ఏటీఎంలో  రూ.10 వేలు విత్ డ్రా చేయగానే బాధితుడిని బెదిరించి నగదు, 8 తులాల బంగారం, బైక్ ,సెల్ ఫోన్ తో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదన్నపేట పోలిసులు, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా రెండు గంటల్లో నిందితులను పట్టుకున్నారు.పాత బస్తికి చెందిన ఇద్దరూ పాత నేరస్తులు వసీం,గౌస్ లుగా గుర్తించారు పోలీసులు.

see more news

పంజాగుట్టలో దారుణం.. 13 ఏళ్ల మైనర్ బాలికపై రేప్

తిరుమలలో ఒంటికి నిప్పంటించుకున్న భక్తుడు

.

Latest Updates