అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది

ఇబ్రహీంపట్నం: అధికార పార్టీ దౌర్జన్యపూరిత కార్యక్రమాలకు పాల్పడుతోందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. ఫార్మసీటీ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో యాచారం ఎంపీపీ సుకన్యను.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అవమానించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పోలీసులు ఆమెను నెట్టివేయడంతో అస్వస్థతకు గురైన సుకన్య ఆస్పత్రిలో చేరింది. ఈ ఘటనతో ఎమ్మెల్యే తీరుపై బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీపీకి జరిగిన అవమానాన్ని తెలుసుకున్న మురళీధర్ రావు.. శనివారం రంగారెడ్డి జిల్లా, యాచారంలోని.. ఎంపీపీ నివాసంలో ఆమెను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు యంత్రాంగం బలంతో షెడ్యూల్ కాస్ట్ మహిళ అని కూడా చూడకుండా ఉద్దేశ్యపూర్వకంగా, కుట్రపూరితంగా దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ చర్యలను కండిస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఈ దాడిని మహిళ కమిషన్, జాతీయ పార్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు. పెట్టుబడిదారీ వర్గాలకు అమ్ముడుపోయే యంత్రాంగాన్ని తయారు చేస్తూ.. టీఆర్ఎస్ నేతలు ఈ రకమైన దాడులకు తెగబడుతున్నారన్నారు. రైతులకు అన్యాయం చేసే చర్యలలో భాగంగానే భారీగా పోలీసు బలగాలు ఎమ్మెల్యే సమీకరించారన్నారు. ఈ దాడిపై ముఖ్యమంత్రి స్పందిచకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా పార్టీ పోరాడుతుందన్నారు మురళీధర్ రావు.

మరిన్ని వార్తల కోసం

రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

పడిపోయిన టమాట రేటు

Latest Updates