ఇండియాకు ఆస్కార్ రాకపోడానికి కారణం ఇదే

భారతీయ సినిమా ప్రపంచంలోనే గొప్పదన్నారు ఆస్కార్స్‌ అకాడమీ అధ్యక్షుడు జాన్‌ బెయిలీ. తన సతీమణీ కరోల్‌తో కలిసి భారత్‌కు వచ్చారు. ముంబైలో ఆస్కార్స్‌ అకాడమీకి సంబంధించిన ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా జాన్‌ మాట్లాడారు. అయితే ఇప్పటివరకు ఒక్క భారతీయ సినిమాకు కూడా ఆస్కార్ అవార్డ్ ఇవ్వక పోయామన్నారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయని చెప్పారు.

‘భారత్‌ ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతులకు పెట్టింది పేరు. కానీ మాకు బాలీవుడ్‌ నుంచి విడుదలయ్యే మ్యూజికల్‌ సినిమాల ద్వారానే భారతీయ చిత్రాల గురించి తెలిసింది. కానీ వాటిలో భారతీయ సంప్రదాయాలు, సంస్కృతులు, విలువల గురించి తెలిపే అంశాలేమీ కనిపించడంలేదు. నేను చెప్పదలచుకున్నది ఏంటంటే. ‘మాకు భారతీయ సినిమా గురించి ఏమీ తెలీదు” అని అన్నారు. అలా తెలీకపోవడంలో మా తప్పేమీ లేదన్నారు జాన్. ఎందుకంటే.. ప్రపంచానికి మీ విలువను తెలియజేసేలా సినిమాలను తెరకెక్కించాల్సిన బాధ్యత భారతీయ దర్శక, నిర్మాతలదన్నారు. ప్రపంచంలో అలాంటి విలువలు ఉన్న సినిమాలకే ప్రాధాన్యం ఉందన్న విషయం మీరు గుర్తించాన్నారు జాన్‌.

Latest Updates