ఆఫీసర్ల ఒత్తిడి తట్టుకోలేక.. కూలీగా మారిన సర్పంచ్

‘పల్లె ప్రగతి’ పూర్తికి చర్యలు
కోహెడ, వెలుగు: పల్లె ప్రగతి పనులు పూర్తి చేయకుంటే సర్పంచ్లపై చర్యలు తీసుకుంటామని అటు ప్రభుత్వం, ఇటు ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉండడంతో కూలీలు దొరకడంలేదు. దీంతో గ్రామాల్లో శ్మశానవాటిక, డంపింగ్ యార్డు పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు ఆఫీసర్ల ఒత్తిడి తట్టుకోలేక సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామ సర్పంచ్ గాజుల రమేశ్ మంగళవారం కూలీగా మారారు. వైకుంఠధామం నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ప్రజలు ఇది చూసి సర్పంచ్ కూలీ పని చేస్తుండంటూ ఆశ్చర్యపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates