రాష్ట్రంలో మరో కరోనా కేసు.. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్

కరోనా వైరస్‌ కట్టడికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం కేసీఆర్‌. శనివారం అసెంబ్లీలో కరోనా వైరస్‌పై మాట్లాడిన సీఎం.. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వస్తే మన రాష్ట్రంలో సక్సెస్ ఫుల్ గా ట్రీట్ మెంట్ చేశామని, ఆ వ్యక్తిని డిశ్చార్జ్ కూడా చేశామని చెప్పారు.  తాజాగా ఇటలీ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. ఆ వ్యక్తికి గాంధీలో ట్రీట్ మెంట్ ఇస్తున్నారని..మరో ఇద్దరికి కూడా కరోనా వైరస్ లక్షణాలుండటంతో వారి రిపోర్ట్‌లను పూణేకి పంపించామని చెప్పారు. ప్రభుత్వ కరోనా నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తున్నామని చెప్పిన సీఎం… ఇప్పటికే దేశంలో 10 మందికి కరోనా నయమైందన్నారు. 65 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు. దేశంలో ఇద్దరు వృద్ధులు మృతి చెందారన్నారు. చరిత్రలో కరోనా లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయన్నారు. బయటి దేశాల నుంచి వస్తున్న వారిలోనే కరోనా వైరస్‌ గుర్తించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్రం, రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, మాల్స్‌ బంద్‌ చేశారన్నారు. ఉన్నతాధికారులతో హైలెవల్‌ కమిటీ మీటింగ్‌ జరుగుతోందన్నారు.

the second case of corona found in state says CM KCR in assembly

Latest Updates