సెక్రటేరియెట్‌‌‌‌ను కరోనా హాస్పిటల్‌‌‌‌గా మార్చాలి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:కరోనా కేసులు పెరుగుతుండడంతో సెక్రటేరియెట్ను కరోనా హాస్పిటల్గా మార్చాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌‌‌‌ వెంకటస్వామి డిమాండ్‌‌‌‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డాక్టర్స్, నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన చేశారు. ఆర్థిక పరిస్థితి బాలేదంటూనే ఉన్నవి కూల్చి కొత్తవి కట్టడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని, దీనిపై పునరాలోచన చేయాలన్నారు. కరోనా తగ్గాక, ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక కొత్త సెక్రటేరియెట్గురించి ఆలోచన చేస్తే బెటరన్నారు.

ప్రజల డబ్బును ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయవద్దని, ఉన్న పైసల్ని పొదుపుగా వాడాలని సీఎంకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతోందని, అందుకే ట్రీట్మెంట్ కోసం గాంధీ హాస్పిటల్‌‌‌‌లో బెడ్స్ ఉన్నా ఎవరూ చేరడం లేదన్నారు. సీఎం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చేయిదాటిపోతోందని, ఇప్పటికైనా మేల్గోకపోతే పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తుందన్నారు. రెండు నెలలపాటు ఉద్యోగులు, పెన్షనర్లకు కట్చేసిన శాలరీని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates