హార్దిక్‌‌ కోసం సెలెక్షన్‌‌ వాయిదా వేశారు

బెంగళూరు:  న్యూజిలాండ్‌‌ టూర్‌‌కు వెళ్లే ఇండియా వన్డే, టెస్టు జట్ల ఎంపిక వాయిదా పడింది. స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా ఫిట్‌‌నెస్‌‌పై స్పష్టత వచ్చాకే టీమ్స్‌‌ను ప్రకటించాలని సెలెక్టర్లు నిర్ణయించారు. దాంతో, ఆదివారం జరగాల్సిన సెలెక్షన్‌‌ కమిటీ మీటింగ్‌‌ను వాయిదా వేశారు.

‘జట్టు ఎంపిక గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. కానీ, హార్దిక్‌‌ పాండ్యా అవసరం టీమ్‌‌కు ఉంది. కాంపిటేటివ్‌‌ క్రికెట్‌‌ ఆడేందుకు ఎన్‌‌సీఏ గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇస్తే అతను ఆటోమేటిక్‌‌గా జట్టులోకి వస్తాడు. అందువల్ల సెలక్టర్లు మరికొన్ని రోజులు వెయిట్‌‌ చేస్తార’ని బీసీసీఐ సీనియర్‌‌ అధికారి ఒకరు తెలిపారు.  కీలకమైన కివీస్‌‌ టూర్‌‌లో హార్దిక్‌‌ పాండ్యా  కోసం టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ ఎదురు చూస్తోంది.

బ్యాక్‌‌ సర్జరీ నుంచి కోలుకున్న పాండ్యా ఫిట్‌‌నెస్‌‌ పరీక్షలో ముఖ్యంగా ‘బౌలింగ్‌‌ వర్క్‌‌లోడ్‌‌ టెస్టు’లో ఫెయిలవడంతో ఇప్పటికే టీ20లకు దూరమయ్యాడు. ఫిట్‌‌నెస్‌‌ నిరూపించుకుంటే వన్డే టీమ్‌‌లో హార్దిక్‌‌కు ప్లేస్‌‌ గ్యారంటీ. ఒకవేళ అతను మళ్లీ ఫెయిలైతే.. పవర్‌‌ హిట్టర్‌‌ సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ను ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. ఇక, కేదార్‌‌ జాదవ్‌‌తో పోల్చితే టెక్నికల్‌‌గా మెరుగైన ఆటగాడైన అజింక్యా రహానెను కూడా కివీస్‌‌కు తీసుకెళ్లాలని సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు. ఇక, వైట్‌‌బాల్‌‌ క్రికెట్‌‌లో అద్భుత ఫామ్‌‌తో దూసుకెళ్తున్న లోకేశ్‌‌ రాహుల్‌‌  టెస్టు టీమ్‌‌లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే, మూడో స్పినర్‌‌గా కుల్దీప్​ బదులు రైజింగ్‌‌ పేసర్‌‌ నవ్‌‌దీప్‌‌ సైనీ ఎక్స్‌‌ట్రా పేసర్‌‌గా టెస్టు టీమ్‌‌లోకి వచ్చే చాన్సుంది.

The selectors decided to announce the Teams after Hardik Pandya's fitness became clear.

More News: అమ్మాయిలు మనోళ్లే.. ఆడేది అమెరికా లీగ్ లో!

ఇండియా Vs ఆసీస్‌‌: నేడే ఆఖరి పోరు

రీ ఎంట్రీతో అదరగొట్టిన సానియా.. టైటిల్ కైవసం

Latest Updates