గ్రేటర్ లో మురుగునీటి శుద్ధి నామ్ కే వాస్త్…

గ్రేటర్ హైదరాబాద్ లో మురుగునీటి శుద్ధి నామ్ కే వాస్త్ గా మారింది. నిత్యం ఉత్పత్తి అయ్యే మురుగు నీటిని సివరేజ్ ట్రీట్ మెంట్ చేయడానికి సరిపడాఎస్టీపీలు లేవు. ఉన్నా అవి సరిగ్గా పనిచేయట్లేదు. ఫలితంగా మురుగు నేరుగా చెరువుల్లోకి,మూసీలో కలిసిపోతుంది. జంట నగరాల నుంచి రోజూ1,600 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోంది . ఈ మొత్తాన్ని శుద్ధి చేయడానికి18 ఎస్టీపీలు ఉన్నాయి. వీటి ద్వారా కేవలం 750 మిలియన్ లీటర్ల మురుగునీటి శుద్ధి మాత్రమే జరుగుతోంది . మిగ తా దంతా నేరుగా చెరువులు, మూసీలో క లిపేస్తున్నారు.

అంబర్ పేట, నాగోలు, అత్తాపూర్, నల్లచెర్వు వద్ద ఉన్న ఎస్టీపీలు మొత్తం ఒకరోజులో 600 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తున్నాయి. మిగిలిన ఎస్టీపీల ద్వారా మరో 150 మిలియన్ లీటర్ల సివరేజ్ ట్రీట్ మెంట్ జరుగుతోంది . వీటి సామర్థ్యం 5 మిలియన్ లీటర్లు​నుంచి10 మిలియన్ లీటర్ల వ ర కు ఉన్నాయి. అయితే రోజురోజుకు జలమండలి పరిధి పెరుగుతోంది . హైద్రాబాద్ మెట్రోవాటర్ అండ్ సివరేజ్ బోర్డు పరిధి 2009లో 700 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి ఉంటే 2016 వచ్చేసరికి అవుటర్ రింగ్ వరకు 1400 స్క్వేర్ కిలో మీటర్లకు పెరిగిపోయింది. అక్కడి వరకు డ్రింకింగ్ వాటర్ సప్లయ్ చేయడంతో పాటు, మురుగునీటి నిర్వహణను సైతం వాటర్ బోర్డుకే అప్పగించింది సర్కార్.

ఈ క్రమంలోనే జలమండలి సివరేజ్ మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసింది. నగరంలో2036 లో ఒకరోజులో 2133 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అయితే, 2051 నాటికి 3059 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అయ్యే చాన్స్ ఉందని అంచనా వేసింది. దానికి అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త ఎస్టీపీల నిర్మాణంపై కసరత్తు చేస్తోంది.

తెరపైకి కొత్త పద్ధతి….

సిటీలో ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని ఒకేచోట ట్రీట్ మెంట్ చేయడం కష్టం . దీంతోనే డీ-సెంట్రలైజ్డ్ ​పద్ధతిని తెరపైకి తెచ్చారు జల మండలి అధికారులు. ఈ ప్రాసెస్ ద్వారా నీటి వనరుల్లోకి మురుగు చేరకుండా చేయొచ్చని భావిస్తున్నారు. ఫస్ట్ ఫేస్ లో భాగంగా జల మండలి పరిధిలోని 48 చెరువుల వద్ద ఎస్టీపీలు నిర్మాణం చేయాలని భావించారు. ఇప్పటికే ఎస్టీపీలు నిర్మించాల్సిన చెరువులను గుర్తించారు. ఎస్టీపీల నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారీ కోసం గతేడాది ముంబయికి చెందిన షా-టెక్నికల్ కన్సల్టెన్సీ అనే ఏజెన్సీకి పనులను అప్పగించారు. డీపీఆర్ తయారీ కోసం ఏజెన్సీకి రూ.7 కోట్లు కట్టబెట్టారు. రెండు నెలల్లో ఎస్టీపీ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ జలమండలికి అందనుంది.

నష్టాల్లో జలమండలి….

నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు జలమండలి కృష్ణ, గోదావ రి న దుల నుంచి నీటిని తీసుకొస్తోంది. క రెంట్ బిల్లులే నెలకు రూ.70 కోట్ల వరకు అవుతున్నాయి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇతర ఖర్చులు కలుపుకొని జల మండలికి నెలకు రూ.120 కోట్ల వరకు ఖర్చవుతోంది . కానీ జలమండలి ఆదాయం మాత్రం రూ.90 కోట్ల. అవి కూడా న గ రంలో ఉన్న 9లక్షల40 వేల నల్లా కనెక్షన్ల ద్వారా వచ్చే ఆదాయం. వాస్తవానికి 100 నుంచి 120 కోట్ల వరకు ఆదాయం రావాల్సిఉంది. వాటర్ వెస్టేజ్, పెండింగ్ బిల్స్ రూపంలో మిగిలిన మొత్తం పోతోంది . ఇలా నెలనెలా రూ.30 కోట్ల లోటు బడ్జెట్ న డుస్తోంది . ఇప్పటికే హడ్కో నిధులు రూ.1,900కోట్లతో సిటీలో 56 రిజర్వాయర్లను నిర్మించింది జల మండలి.

రూ.25 వేల కోట్లు అవసరం…

హైదరాబాద్ మెట్రో వాటర్ అండ్ సివరేజ్ బోర్డు చేతికి కొత్త ఎస్టీపీల మాస్టర్ ప్లాన్ వచ్చినా నిర్మాణం చేయడం అనుమానమే. ఎందుకంటే డీసెంట్రలైజ్డ్ పద్ధతి లో నిర్మించే ఎస్టీపీల కోసం భారీగా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది . మురుగునీటితో కలుషితమవుతున్న చెరువలను కాపాడాలనే ఉద్దేశం బాగున్నా, సిటీలో దాదాపు అన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి. చెరువుల పక్కనే కాలనీలు వెలిశాయి. దీనితోడు ఎస్టీపీల నిర్మాణానికి నిధుల సేక ర ణ అధికారుల కు కష్టంగా మారనుంది. ఈ ప్రతిపాదనలు తెర పైకి వచ్చినప్పటి నుంచి జల మండలి అధికారులు నిధులు విషయంలోనే తలలు పట్టుకుంటున్నారు. ఎస్టీపీల నిర్మాణం కోసం భారీ ఖర్చు ఉంటుంది . జలమండలి అధికారుల లెక్కల ప్రకారం రూ.25 వేల కోట్లు కావాల్సి ఉందని భావిస్తున్నారు.

Latest Updates