పాపం ప్రియాంక.. రిలీజ్ కు ముందే చెడ్డీ సీన్ లీక్

పైరసీ… సినీ పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటే.. రిలీజ్ అయిన గంటల్లోనే స్పై కెమెరాలతో రికార్డ్ చేసి, ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా రిలీజ్ కు ముందే కొన్ని సినిమాలను లీక్ చేసిపారేస్తుంటే.. కొన్ని సినిమాల్లో ముఖ్యమైన సీన్లను బయటపెట్టేస్తున్నారు చిత్ర సీమ దొంగలు.

ఇప్పడు ఇలాంటి కష్టమే వచ్చింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు. హీరో ఫర్హాన్ అక్తర్ తో జంటగా నటిస్తున్న ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమాలోని ఓ హాట్ రొమాంటిక్ సీన్ లీక్ అయింది. ఈ సినిమా రిలీజ్ అక్టోబర్ 11న.

లీక్ అయిన సీన్ లో ప్రియాంక చోప్రా.. హీరో వేసుకున్న చెడ్డీ కోసం పోరాడుతుంటుంది. ఫర్హాన్ అక్తర్ వేసుకున్న ఆ చెడ్డీ నాదీ.. అంటూ ఆమె కామెంట్ చేస్తుంది. ఇలా వారిద్దరి మధ్య నడిచే రొమాంటిక్ సీన్ అది.

ఈ సీన్ అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు పాపం అంటే.. మరికొందరు ఛీఛీ అంటూ ప్రియాంకను ఆడుకుంటున్నారు.

 

Latest Updates