అర్ధరాత్రి తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి చేసిన కొడుకు

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో ఘటన
తీవ్ర గాయాలతో హైదరాబాబాద్ ఉస్మానియాకు తరలింపు
నారాయణ పేట జిల్లా : మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అర్ధ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లిదండ్రులు రాములు, కమలమ్మ లపై దాడి చేసి గొడ్డలితో ఎక్కడపడ్తే అక్కడ దారుణంగా నరికాడు కొడుకు వెంకటేష్. కొద్ది రోజులుగా మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తూ దారుణానికి ఒడిగట్టాడు. కన్న కొడుకే చంపేందుకు గొడ్డలితో దాడి చేస్తుంటే వృద్ధులైన తల్లిదండ్రులు కేకలు వేశారు. ఇంట్లోనే నిద్రిస్తున్న చిన్న కొడుకు గోపి అడ్డుకుని ఇరుగు పొరుగు వారిని పిలవడంతో వెంకటేష్ పరారై పోయాడు. గాయపడిన తల్లిదండ్రులను చిన్న కొడుకు గోపి గ్రామస్తుల సహాయంతో చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. ప్రాథమిక చికిత్స అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స చేసిన వైద్యుల సిఫారసు మేరకు మెరుగైన వైద్య సదుపాయాలున్న హైదరాబాద్ లోని ఉస్మానియాకు ఆసుపత్రి కి తరలించారు.
కన్న కొడుకు చేతిలోనే తీవ్రంగా గాయపడిన రాములు, కమలమ్మ దంపతులకు ఐదు మంది సంతానం, ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు. ముగ్గురు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేసేశాడు. మగ పిల్లల పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టేలోగానే పెద్ద కొడుకు వెంకటేష్ మతిస్థిమితం లేకుండా ప్రవర్తించడం ప్రారంభించాడు. సొంత కుటుంబ సభ్యులపైనే సైకోలాగా ప్రవర్తిస్తూ వచ్చాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులను తమ్ముడిని చంపుతానంటూ భయపెట్టేస్తుండేవాడు. కొంత కాలం క్రితం కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఎర్రగడ్డ పిచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ మధ్యకాలంలో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన వెంకటేష్ ఊరికి రాగానే మంచిగానే ఉండేవాడు. ఏమైందో గానీ మళ్లీ ఈమధ్యన కొన్ని రోజులనుంచి మతిస్థిమితం లేకుండా ప్రవర్తించడం ప్రారంభించాడు. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు. ఇంట్లో ప్రతి రోజు తల్లిదండ్రులు తమ్ముడు తో గొడవ పడేవాడు. గత 15 రోజుల క్రితం తమ్ముడు గోపిను చంపుతానని భయపెట్టాడు. గ్రామంలోని గట్టు తిమ్మప్ప దేవాలయం దగ్గర కొన్ని రోజులుగా నిద్రిస్తుండేవాడు. 3 రాజుల క్రితం తల్లి కమలమ్మను గొంతు నలిపి చంపబోతే తమ్ముడు గోపి గమనించి తల్లిని రక్షించాడని సమాచారం.

Latest Updates