బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు

ఇల్లు అమ్మనియ్యలేదని దారుణం 

నల్గొండ క్రైమ్, వెలుగు: ఇంటిని అమ్మేందుకు ఒప్పుకోలేదని ఇంట్లో పడుకున్న తల్లి పైన కిరోసిన్ పోసి తగులబెట్టాడు ఒక కొడుకు. నల్గొండ మండలంలోని నర్సింగ్ బట్ల గ్రామంలో ఈఘటన జరిగింది. గ్రామానికి చెందిన తిరుమల శాంతమ్మకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులున్నారని, ఆస్తి పంపకాలు జరిగినప్పుడు తల్లి శాంతమ్మను చిన్న కొడుకు తిరుమల లింగస్వామి చూడాలని ఒప్పందం చేసుకున్నారు. తల్లిని ఊళ్లోని ఇంట్లోనే ఉంచి లింగస్వామి హైదరాబాద్​లో కూలీపని చేసుకుంటున్నాడు.

లాక్ డౌన్ వల్ల పది రోజుల కింద గ్రామానికి వచ్చిన అతడు ఇంటిని అమ్మేందుకు  ప్రయత్నాలు చేయగా, శాంతమ్మ నిరాకరించింది. దీంతో మంగళవారం రాత్రి మంచం మీద పడుకున్న  శాంతమ్మ(55)మీద  కిరోసిన్ పోసి నిప్పంటించాడు.  కాలిన గాయాలతో ఆమె చనిపోయింది. మనువడు బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. లింగస్వామి పరారీలో ఉన్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

 

Latest Updates