వరంగల్‌‌‌‌‌కు రూ.162 కోట్లు రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

వరంగల్‌‌‌‌ స్మార్ట్‌‌‌‌ సిటీకి రూ.162 కోట్లు రిలీజ్

బీజేపీ విమర్శలతో దిగివచ్చిన సర్కారు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వరంగల్‌‌‌‌ స్మార్ట్‌‌‌‌ సిటీకి రాష్ట్ర సర్కారు రూ.161.90 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం వరంగల్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌ స్మార్ట్‌‌‌‌ సిటీలకు రూ.196.40 కోట్ల చొప్పున 392.80 కోట్లు ఇచ్చినా ఆ నిధులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందంటూ బీజేపీ స్టేట్ చీఫ్​బండి సంజయ్‌‌‌‌ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌‌‌‌ సిటీల కాలపరిమితి త్వరలోనే ముగుస్తుండటంతో నిధులు ఖర్చు చేయకపోతే లాప్స్ అవుతాయంటూ బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ విమర్శల దాటికి దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌‌‌‌కు నిధులు విడుదల చేసింది. ఈమేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ అర్వింద్‌‌‌‌ కుమార్‌‌‌‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్‌‌‌‌ స్మార్ట్‌‌‌‌ సిటీకి రూ.196.40 కోట్లు రిలీజ్ చేయగా అందులో 2016–17లో రూ.2.50 కోట్లు, 2017–18లో రూ.32 కోట్లు, 2020–21లో 161.90 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా రిలీజ్‌‌‌‌ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌‌‌‌ సిటీ మిషన్‌‌‌‌ను 2015లో ప్రారంభించగా, 2016లో వరంగల్‌‌‌‌ను ఆ స్కీంలో ఇంక్లూడ్‌‌‌‌ చేసిందని తెలిపారు. వరంగల్‌‌‌‌లో రూ.1,029.01 కోట్ల అంచనాతో 63 పనులు చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు రూ.46.67 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా రూ.40.67 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు. ఈ యేడాది మే చివరి నాటికి మిగతా మొత్తం నిధులను ఖర్చు చేస్తామని తెలిపారు. ఆయా పనుల కోసం భూ సేకరణ, డీపీఆర్‌‌‌‌ల తయారీలో ఆలస్యం కావడంతోనే నిధులు ఖర్చు చేయలేకపోయామని వివరణ ఇచ్చారు. పనులు పూర్తి కాగానే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్‌‌‌‌ గ్రాంట్‌‌‌‌ను జత చేసి బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. వరంగల్‌‌‌‌ నగరానికి సీఎం ఇచ్చిన హామీల్లో భాగంగా రూ.109.29 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.72.87 కోట్లు అదనంగా విడుదల చేశామని తెలిపారు.

For More News..

ఫోర్త్‌‌‌‌ క్లాస్‌‌‌‌ జాబ్స్ రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం!

హఫీజ్‌‌‌‌పేట్‌‌‌‌లో అడ్డా వేసిన భూమా ఫ్యామిలీ

ఆరేండ్లలో 630 జూనియర్ కాలేజీలు క్లోజ్

Latest Updates