ప్రేమ వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధింపులకు గురిచేయడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా కోహెడ మండలం మైసంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్యకు ఇద్దరు కుమార్తెలు. లక్ష్మణ్ పెద్ద కుమార్తె సిద్దిరాల జ్యో తి(24) డిగ్రీ పూర్తి చేసికేపీహెచ్ బీ నాల్గవ ఫేజ్ లో స్నేహితులతో కలిసి నివాసం ఉంటూ బేగంపేట్ ప్రకాశ్ నగర్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రెండేళ్లుగా సిద్దిపేట్ జిల్లా ఖాత గ్రామానికి చెందిన రాజేష్ రెడ్డి నగరంలో ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలోఉద్యోగం చేస్తూ జ్యోతిని ప్రేమ పేరుతో పెళ్లిచేసుకుందాం అంటూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ నెల 15న సాయంత్రం కేపీహెచ్ బీ 9ఫేజ్ లోని ఓ పార్కులో సాయంత్రం ఇద్దరు కలిసిమాట్లాడుకునే సమయంలో ఇద్దరి మధ్య పెళ్లివిషయం తలెత్తడంతో జ్యోతి తన వెంట తెచ్చుకున్న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి జ్యోతి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆసుపత్రిలోచికిత్స పొందుతూ జ్యోతి మృతిచెందింది. రాజేష్రెడ్డి వేధింపులు తాళలేక తన కుమార్తె ఆత్మహత్యచేసుకుందని జ్యోతి తండ్రి లక్ష్మణ్ కేపీహెచ్ బీపో-లీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి తండ్రిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ నర్సింహులు తెలిపారు.

డబ్బులు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తాం

జ్యోతి ఆత్మహత్యకు పాల్పడిన వెంటనే చికిత్సకోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మృతి చెందింది.చికిత్స చేస్తున్న సమయంలో జ్యోతి మృతిచెందడంతో చెల్లించాల్సిన మొత్తం డబ్బు చెల్లి స్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి యాజ-మాన్యం జ్యోతి బంధువులకు తెలియజేశారు.దీంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు.

 

Latest Updates