మూసీపై బ్రిడ్జిల సర్వే ముందుకు సాగట్లె

కాగితాల్లోనే కొత్త బ్రిడ్జిల నిర్మాణాలు

ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రతిపాదనలు

ఇప్పటికీ మొదలు పెట్టని సర్వే పనులు

హైదరాబాద్, వెలుగు : మూసీ నది​పై కొత్త బ్రిడ్జిల నిర్మాణం ప్రతిపాదనలు కాగితాల్లోనే ఉండిపోయాయి.  ఇప్పటికే మూసీపై 4 బ్రిడ్జిలు ఉన్నాయి. అదనంగా మరో 5 బ్రిడ్జిలు నిర్మించేందుకు సర్కార్​ ప్లాన్​ చేసింది.  ఇందులో ఒకటి పెడెస్ట్రియన్, స్ర్టీట్​వెండర్స్​కు ఫ్రూట్ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించింది.  వీటి నిర్మాణాల కోసం ఎన్నికల ముందు అధికారులు హడావుడి చేశారు. వంతెనల నిర్మాణానికి అనువైన ప్రాంతాల గుర్తింపు, వెహికల్​ రద్దీ, బ్రిడ్జిల విస్తరణ వంటి అంశాలపై చేయాల్సిన సర్వే పూర్తి కాలేదు. ఎన్నికలయ్యాక ఇప్పటికీ ముందుకు సాగడం లేదు.  మూసీ పై‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  బ్రిడ్జిలు, ఫోర్​ లైన్​ వే  నిర్మాణానికి ఏడాది కిందట ప్రతిపాదించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో భాగంగా వీటిని నిర్మించనున్నారు. అఫ్జల్ గంజ్ దగ్గర ఫ్రూట్ మార్కెట్ కారణంగా తరచూ  ట్రాఫిక్ జామ్, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ పెడిస్ట్రీయన్, ఫ్రూట్ బ్రిడ్జి థీమ్ తో నిర్మించాలని భావించారు. కానీ ప్రతిపాదించిన ప్లానులెవీ ఇప్పటికీ అమలులోకి రాలేదు.

సర్వే చేయలే…

ప్రతిపాదిత 5 బ్రిడ్జిల నిర్మాణానికి తొలుత ఫీల్డ్ సర్వే చేయాలని భావించారు.  నదిని దాటే ప్రాంతాల్లో వెహికల్ ​రద్దీ, ఇరుకు ప్రాంతాలు, ప్రస్తుతం ఉన్న ఆరాంఘర్, అత్తాపూర్, చాదర్ ఘాట్, పురానాపూల్, బాపూఘాట్, ముస్లిం జంగ్ బ్రిడ్జిలపై వెహికల్ రద్దీ తగ్గించే విధంగా ప్రతిపాదించారు.  వీటి మధ్య గ్యాప్ ను భర్తీ చేసేలా, నిర్మించాలనుకున్నా ఇప్పటివరకు ఎలాంటి సర్వే చేయలేదు. దీంతో అట్టహాసంగా ప్రకటించిన బ్రిడ్జిల నిర్మాణ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ఇవి నిర్మిస్తే మూసీ దాటేందుకు, స్థానికుల రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది.  అదేవిధంగా మూసీ వెంట నాలుగు లైన్ల రోడ్లను నిర్మించాలనే అంశం కూడా కార్యరూపంలోకి రాలేదు.

స్ట్రీట్ వెండర్ల కోసం

సాలార్​జంగ్ మ్యూజియం పరిసరాల్లో 300కు పైగా స్ట్రీట్ వెండర్లు బిజినెస్​ చేసుకునేలా ఫ్రూట్ బ్రిడ్జితోపాటు వెహికల్​ లేకుండా సేద తీరేలా పెడెస్ట్రియన్ బ్రిడ్జిని నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దీని వల్ల ప్రస్తుతం ఉన్న సాలార్ జంగ్ ప్రాంతంలోని బ్రిడ్జిపై రద్దీ తగ్గనుంది. అదే విధంగా సాయంత్రం వేళల్లో చార్మినార్ దగ్గరికి వచ్చే టూరిస్టులను మరింత ఆకట్టుకునేలా మూసీపై బ్రిడ్జిల నిర్మించాలని  భావించినా, ఇప్పటికీ ఆచరణలోకి తీసుకురాలేకపోయారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్లు అమ్మినా.. కిరాయికి ఇచ్చినా పట్టా రద్దు

అది నా బెస్ట్‌.. అందుకే వీడియో మళ్లీ మళ్లీ చూస్తున్నా..

ఫ్రెండ్ షిప్ పేరుతో ట్రాప్‌‌‌‌‌‌‌‌.. గిఫ్ట్‌లు తెచ్చామంటూ మోసాలు

హోమ్‌‌ లోన్లపై ఎస్‌‌బీఐ గుడ్‌‌న్యూస్


Latest Updates