ఏఎన్‌యూ విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

‘జై అమరావతి’ అని నినాదాలు చేసిన ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి చెందిన నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేసింది ANU యాజమాన్యం.అయితే పలు ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు నుంచి విమర్శలు రావడంతో..యాజమాన్యం వెనకడుగు వేసి సస్పెన్షన్ ఎత్తివేసింది.

యూనివర్సిటీ వీసీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ యూనివర్శిటీ ముందు సోమవారం విద్యార్థులు ధర్నాకు దిగారు. అమరావతి పరిరక్షణ విద్యార్థి యువజన ఐకాస నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. దీంతో యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

Latest Updates