రిజిస్ట్రేష‌న్ల శాఖ‌కు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం

రిజిస్ట్రేష‌న్ల శాఖ‌కు సెల‌వు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్స్ చట్టం తేబోతున్న తరుణంలో తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ‌కు ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించింది. రేపటి నుండి అన్ని రిజిస్ట్రేషన్స్ నిలిపివేస్తూ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వీఆర్వోల నుంచి రికార్డులను ఉన్నఫళంగా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నుంచి వాట్సాప్ మెసేజ్ ద్వారా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి.దీంతో హుటాహుటిన తహశీల్దార్ లు వి ఆర్ వో నుండి రికార్డులు స్వాధీనం చేసుకుంటున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో వీఆర్వోల నుండి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం, అది కూడా ఈ మధ్యాహ్నం 3 గంటలకు పూర్తవ్వాలని సాయంత్రం 5.30 గంటలకల్లా అందుకు సంబంధించి తనకు నివేదించాలని సీఎస్ నుండి ఉత్తర్వులు రావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా తహశీల్దార్ లు వి ఆర్ వో లనుండి అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డుల స్వాధీనపు అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Latest Updates