రేపటి నుంచి  6, 7, 8  తరగతులు ప్రారంభం

The Telangana government will start classes 6, 7 and 8 from tomorrow

రేపటి(బుధవారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా  6, 7, 8  తరగతులు ప్రారంభం కానున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 6, 7, 8  తరగతులను బుధవారం నుండి మార్చి ఒకటవ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని తెలిపారు. అంతేకాదు కరోనా మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.  దీంతో పాటు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

ఫిబ్రవరి 1 నుంచి హైస్కూల్ స్థాయిలో 9, 10వ తరగతితో పాటు కాలేజీ స్థాయిలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి.

Latest Updates