తెలంగాణ గ్రామీణ బ్యాంక్ : ఆ ఆకౌంట్ లలో పొరపాటున డబ్బులేసినం

హైదరాబాద్‌, వెలుగు: ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్ యోజన సాయంకింద జన్‌ధన్‌ అకౌంట్లలో మాత్రమే జమ చేయాల్సిన రూ.500లను పొరపాటున బేసిక్‌ సేవింగ్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ (బీఎస్ బీడీ) అకౌంట్లలో నూ జమ చేశామని తెలంగాణ గ్రామీణ బ్యాం కు (టీజీబీ) చీఫ్ మేనేజర్  రాజశేఖరన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘మార్చి 25 నాటికి అన్ని బ్రాంచీల్లో8,56,279 మంది మహిళలకు జన్‌ధన్‌, బీఎస్‌బీడీ (జీరో) అకౌంట్లు ఉన్నట్టు గుర్తించాం. వారి ఖాతాల్లో ఏప్రిల్‌ 2న రూ.42,81,39,500 జమ చేశాం. అయితే ఈ అకౌంట్లలో 2014లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద తీసినవి 5,15,260 మాత్రమేనని తర్వాత గుర్తించాం. మిగతా 3,41,019 అకౌంట్లు అంతకుముందే బీఎ స్‌బీడీ (జీరో) కింద మహిళలు ఓపెన్‌ చేసినవి. వారి అకౌంట్లలో జమ చేసిన రూ.17,05,09,500లను ఏప్రిల్‌ 10న రికవరీ చేయడానికి ప్రయత్నించాం. అప్పటికే 7,506 మంది తమ డబ్బులు డ్రా చేసుకు న్నారు. ఆ మొత్తం పోను మిగతా డబ్బును రివర్స్‌ తీ సుకున్నాం. డబ్బుడ్రా చేసిన అకౌంట్‌ హోల్డ ర్లనుంచి త్వరలోనే విత్‌డ్రా చేసిన మొత్తాన్ని రికవరీ చేస్తాం” ఆయన వివరించారు.

Latest Updates