ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువు పెంపు

తెలంగాణ విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వం, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి బుధ‌వారంతో అడ్మిషన్ల గడువు ముగియగా.. కరోనా పరిస్థితుల నేప‌థ్యంలో అక్టోబర్ 20వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ ఇంటర్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను అధికారులు ఇంటర్ బోర్డు అధికారక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Latest Updates