విశ్వాస పరీక్ష ఇప్పుడే చెప్పలేం

అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉంటుందా..? లేదా అనేది.. ఇప్పుడే చెప్పలేమన్నారు మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతి. దీనిపై రేపు ఉదయమే క్లారిటీ వస్తుందని చెప్పారు. ఇక.. రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు తనను ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు స్పీకర్. వేరే వ్యక్తుల ద్వారా తనకు రాజీనామా లేఖలు వచ్చాయన్నారు. ఎమ్మెల్యేల విషయంలో ఏం జరుగుతోందని తనకు ఆందోళనగా ఉందన్నారు.

Latest Updates