కొత్త టెక్నాలజీ సాయంతో లక్షల జాబ్స్​ వస్తాయ్​

హైదరాబాద్, వెలుగు : ఆసియాలోనే అతిపెద్దలో రావ్యాన్‌‌ కాన్ఫరెన్స్, ది థింగ్స్ కాన్ఫరెన్స్ ఇండియా 2019 హెచ్‌‌ఐసీసీ హైదరాబాద్‌‌లో ప్రారంభమైంది. ఐబీ హబ్స్ సహకారంతో సైబర్‌‌‌‌ఐ ఈ కాన్ఫరెన్స్‌‌ను నిర్వహిస్తోంది. ఐఓటీ, లోరావ్యాన్(లో పవర్ వైడ్ ఏరియా నెట్‌‌వర్క్ టెక్నాలజీ)పై ఫోకస్ చేస్తూ ఈ కాన్ఫరెన్స్ రెండు రోజుల పాటు జరుగుతుంది. ఈ ఈవెంట్‌‌కి తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరయ్యారు. 10 దేశాలకు చెందిన 700 మందికి పైగా ప్రతినిధులు ఈ కాన్ఫరెన్స్‌‌లో పాల్గొంటున్నారని సైబర్‌‌‌‌ఐ సీఈవో రామ్ గణేష్ చెప్పారు. లోరావ్యాన్‌‌ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, స్మార్ట్‌‌ సిటీలను అభివృద్ధి చేయడంలో ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో స్మార్ట్‌‌ నేషన్‌‌గా ఇండియా మార్చడానికి ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ దోహదం చేస్తుందన్నారు. ఇస్రో, మైక్రోచిప్, ఏఆర్‌‌‌‌ఎం, ది థింగ్స్ ఇండస్ట్రీస్ వంటి పలు ఆర్గనైజేషన్ల నిపుణులు ఈ కాన్ఫరెన్స్‌‌లో పాల్గొంటున్నారని చెప్పారు.

కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్‌‌లో లక్షల కొద్దీ ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పారు. ఇండస్ట్రీకి చెందిన నాలుగో తరం టెక్నాలజీల్లో గ్లోబల్‌‌ లీడర్‌‌‌‌గా ఎదిగేందుకు ఐబీ హబ్స్ చూస్తుందని ఆ కంపెనీ సీఈవో కావ్య తెలిపారు. మన స్టార్టప్‌‌లను గ్లోబల్‌‌గా నిలబెట్టేందుకు ఐబీ హబ్స్ ఎంతో సహకరిస్తుందని, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్‌‌లను అభివృద్ధి చేయడంలో సాయపడుతున్నామని చెప్పారు. తెలంగాణ, యూపీ,ఏపీ, జార్ఖాండ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ వంటి పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కాన్ఫరెన్స్‌‌ను సపోర్ట్ చేస్తున్నాయి. ఐబీ హబ్స్ అమెరికాలోని కాలిఫోర్నియాలో వరల్డ్ లార్జెస్ట్ అప్‌‌స్కిలింగ్ సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా కావ్య వెల్లడించారు. ఇది 1130 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇండస్ట్రీ నాలుగో తరానికి సంబంధించిన ఎకో సిస్టమ్ ను క్రియేట్ చేయడానికి ఐబీ హబ్స్‌‌ మరింత సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఐఐటీ, ఐఐఎం, ఎన్‌‌ఐటీల్లో పట్టాలు పొందిన గ్రాడ్యుయేట్లు ఐబీ హబ్స్‌‌లో టీమ్‌‌గా ఉన్నారు. మొత్తం 250కి పైగా ఉద్యోగులు దీనిలో పనిచేస్తున్నారు. పలు కార్యక్రమాల్లో ఐబీ హబ్స్ 140 కి పైగా స్టార్టప్‌‌లకు సహకరిస్తోంది.

Latest Updates