నగర శివార్లలోని క్వారీలు యువకుల పాలిట డెత్ జోన్లు

ఎండలు దంచికొడుతున్నాయి. టెంపరేచర్ 43 డిగ్రీలు దాటుతోంది. భానుడి ప్రాతాపానికి నగరవాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈతపై ఆసక్తి చూపుతున్నారు. సిటీలో ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్స్​ ఉండగా, శివారు ప్రాంతాల్లో క్వారీలను ఆశ్రయిస్తున్నారు. క్వారీల్లో ఈతకు వెళ్లిన వారికి లోతు తెలియక నీటమునిగి చనిపోతున్నఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

స్విమ్మింగ్ పూల్స్​లోనూ కేర్ టేకర్లు, కోచ్ లు లేకపోవడంతో పిల్లలతో పాటు పేరెంట్స్ వెళ్లినా భయపడే పరిస్థితులున్నాయి. చాలా చోట్ల స్విమ్మింగ్ పూల్స్ లో కోచ్ లు అందుబాటులో లేక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కో స్విమ్మింగ్ పూల్ లో నిర్ణీత వ్యవధిలో ఈతకు అవకాశం ఉన్నా కెపాసిటీకి మించి అనుమతించడంతో ప్రమాదాలకు దారితీస్తున్నట్టు తెలుస్తోంది.

50కి పైగా ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ జీహెచ్ఎంసీ పరిధిలో ఏడు స్విమ్మింగ్ పూల్స్ నిర్వహిస్తున్నారు. వీటిలో నిబంధనలకు లోబడే వాటర్ లెవల్స్ ఉంటున్నాయి. కేర్ టేకర్స్​ను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఇవి కాకుండా సిటీలో 50కి పైగా ప్రైవేటు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఇందులో గంట వ్యవధితో ఫీజువసూలు చేస్తున్నారు. దానికితోడు పరిమితికి మించి అనుమతించడం, కేర్ టేకర్లు లేకపోవండంతో ప్రమాదాలు జరిగితే ఎలా అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డెత్ జోన్లుగా క్వారీలు, చెరువులు, నగర శివార్లలోని క్వారీలు యువకుల పాలిటి డెత్ జోన్లుగా మారాయి. ఎక్కువగా కూలీల పిల్లలు,సిటీ శివారు ప్రాంతాల యువతే వీటిలో పడి చని-పోతున్నారు. ఈ నెల 15న పేట్ బషీర్ బాద్ లోని సుభాష్ నగర్ నగర్ కు చెందిన ఆనంద్ (15)యాదిరెడ్డి బండలోని క్వారీలో ఈతకు వెళ్లి చనిపోయాడు. ఇలాంటి ఘటనే గత నెల 21న చాంద్రయాణ్ గుట్ట పరిధిలోని జల్ పల్లిలో జరిగింది.

ఆ  గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లి మిశ్రీగంజ్ కు చెందిన ఇస్మాయిల్ చనిపోయాడు. మరో బాలుడితో కలిసి చెరువులోకి దిగిన ఇస్మాయిల్ ఈత రాక మృత్యువాత పడ్డాడు. ఇవే కాకుండా గత డిసెంబర్ 23న శంషాబాద్ కొత్వాల్ గూడలోని ఓ క్వారీ ముగ్గురు విద్యార్థులను బలితీసుకుంది. బోరబండకు చెందిన సూర్య(22), చంద్ర(18)భార్గవ్ (20) మానసా హిల్స్ లోని ఓ క్వారీలో నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు.

Latest Updates