కరోనా వైరస్ ముగింపుపై కలలు కనే టైం వచ్చింది

కరోనా వైరస్ ముగింపుపై  కలలు కనే టైం వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపింది. వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ల సానుకూల ఫలితాలపై  WHO ఈ ప్రకటన చేసింది. వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ  హెచ్చరించిన WHO ప్రస్తుతం సానుకూల ప్రకటనలు చేస్తోంది. అయితే, వ్యాక్సిన్  విషయంలో పేద దేశాలపై… ధనిక దేశాలు ఆధిపత్యం  కొనసాగించవద్దని WHO డైరెక్టర్ జనరల్  టెడ్రోస్  తెలిపారు. కరోనా  అంతానికి సమయం  దగ్గరపడ్డప్పటికీ…. ఆ దిశగా వెళుతున్న మార్గమే కొంత అనుమానాస్పదంగా  ఉందన్నారు.

పేద దేశాలకు టీకా అందుబాటులోకి  రావడంపై  ఉన్న సందేహాలను  వ్యక్తం చేశారు టెడ్రోస్. వైరస్ టైం… ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచితో పాటు  చెడునూ వెలుగులోకి తెచ్చిందన్నారు. పేదరికం, ఆకలి, అసమానత, పర్యావరణ మార్పుల వంటి శాశ్వత సమస్యలకు ఎలాంటి వ్యాక్సిన్  పరిష్కారం  చూపలేదన్నారు. వ్యాక్సిన్ ను ప్రవేట్  వినియోగ వస్తువుగా  చూడరాదని.. అందరికీ  అందుబాటులోకి  వచ్చేలా పంపిణీ వ్యవస్థ ఉండాలని  టెడ్రోస్  పేర్కొన్నారు.

Latest Updates