దిశ ఘటనతో ఆ ఏరియా అంటేనే హడలెత్తున్నారు

దిశ ఘటన తర్వాత హైదరాబాద్  శివారు ప్రాంతమైన తొండుపల్లి ఔటర్  రింగురోడ్డు టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి మారిపోయింది. ఆ పరిసరాల్లోని భవానీనగర్ ఏరియాలో మహిళలు భయం భయంగా గడుపుతున్నారు. టోల్ గేట్ దాటిన తర్వాత అంతా నిర్మానుష్యంగా ఉండడంతో పగటి పూట కూడా ఒంటరిగా వెళ్లే ధైర్యం చేయడం లేదు. అయితే దిశ ఘటన తర్వాత తొండుపల్లి ఔటర్  జంక్షన్  దగ్గర పోలీసుల గస్తీ పెరిగింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో స్థలం యజమాని ప్రహారీగోడ కట్టారు. అయినప్పటికీ అటుగా వెళ్లేందుకు మహిళలు భయపడుతున్నారు. భవానీనగర్ వెళ్లే రూట్ లో పోలీసుల గస్తీ పెంచాలని, వీధి లైట్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Latest Updates