మనదేశంలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు : ఏఏ రాష్ట్రాల్లో ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయంటే

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. లాక్‌ డౌన్ మినహాయింపు తరువాత ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది.  తాజాగా కేంద్రం  విడుదల చేసిన కరోనా హెల్త్  బులెటిన్ ప్రకారం ఉదయం 8గంటల ప్రాంతంలో మన దేశంలో మొత్తం 1,98,706 కేసులున్నాయి. తాజాగా ఆ కేసుల సంఖ్య 2లక్షలు దాటింది.

ఇండియా టుడే కథనం ప్రకారం ఈరోజు సాయంత్రం 6.30లకు పలు రాష్ట్రాల్లో కొత్తగా నమోదైన కేసులతో మొత్తం 2,00327కి చేరాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. 6.30గంటల సమయానికి మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అప్ డేట్ కాలేదని పూర్తిస్థాయి సమాచారం వస్తే తప్పా కేసులు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని గుర్తించలేమని అధికారులు తెలిపారు.

ఇక కొత్తగా కేసులు నమోదై అందుబాటులో ఉన్న వివరాల్ని పరిశీలించగా  తమిళనాడులో అత్యధికంగా 1,091 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 24,586కి చేరింది.

తమిళనాడుతో పాటు, రాజస్థాన్‌లో ఈ రోజు (సాయంత్రం 6 గంటల వరకు) 291 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి మొత్తం కేసుల సంఖ్య 9,271కి చేరింది.

అస్సాంలో ఈ రోజు కనీసం 123 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య  1513కి చేరింది.

హర్యానాలో 106 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పుడు కేసుల సంఖ్య  2,462కి చేరింది.

హిమాచల్ ప్రదేశ్‌లో 5 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 345కి చేరింది.

అరుణాచల్ ప్రదేశ్ ఈ రోజు 5 కొత్త కేసులను నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల  సంఖ్య 27 కి చేరుకుంది.

Latest Updates