ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు ఇవ్వలేం మీరే కొనుక్కోవాలి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లు, గేటెడ్ కమ్యూనిటీ, ప్రైవేట్ సంస్థలు ఇక నుంచి ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు సొంతంగా కొనుక్కోవాలని టీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌ వెల్లడించింది. ఇన్నాళ్లు డిస్కంలు ప్రైవేటు సంస్థల నుంచి ఫీజు తీసుకొని ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు సరఫరా చేసేవి. మారిన పరిస్థితుల్లో ట్రాన్స్ ఫార్మర్ల మంజూరు విధానంలో మార్పులు తీసుకువచ్చినట్లు సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల తయారీలో ఉపయోగించే “అమౌర్ఫోస్ కోర్” అనే ముడిసరుకు చైనా నుంచి దిగుమతి కావడం లేదన్నారు.

దీంతో తయారీ సంస్థలు సకాలంలో సరఫరా చేయలేక పోతున్నాయని వివరించారు. దీంతో అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లు, గేటెడ్ కమ్యూనిటీ, ప్రైవేట్ సంస్థలు డిస్కం ప్రామాణిక డీలర్ల నుంచి నేరుగా ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు ప్రాంతాల వారిగా ఆపరేషన్‌‌‌‌ విభాగం ఎస్‌‌‌‌ఈలను సంప్రదించాలని సీఎండీ వెల్లడించారు.

see also: సరోగసి కాదు.. సహజీవనం చేద్దమన్నడు

చాక్లెట్లు, పానీపూరి ఆశచూపి.. బాలికపై అత్యాచారం

Latest Updates