ఇంటి ‌‌‌‌ఖర్చుకు పైసలు చాల్తలేవా?అయితే ఇట్ల చేయొచ్చు

వెలుగు : అవసరాలు, ఆర్థిక భద్రత,  సౌకర్యాలు లేదా కోరికలకు  మీ బడ్జెట్ సరిపోవడం లేదా? మీరేకాదు ప్రతి భారతీయ కుటుంబం ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటోంది. పిల్లల స్కూల్​ఫీజులు, గ్రోసరీ, మెడికల్​ ఇన్సూరెన్స్, హోమ్​లోన్ ఈఎంఐ వంటి వాటిని తప్పించుకోలేము.  రెస్టారెంట్లలో తినడం, షాపింగ్‌‌, కొత్త గ్యాడ్జెట్‌‌లను కొనడం​వంటి లగ్జరీ ఖర్చులు పర్సును ఖాళీ చేసేస్తుంటాయి. మన బడ్జెట్‌‌లో వీటికి ఏ విధంగా కేటాయింపులు చేయాలి?  దానికి సమాధానమే ఇది. ఫేమస్​ రచయిత సెనేటర్​ఎలిజబెత్​వారెన్ రాసిన ‘ది అల్టిమేట్​ లైఫ్‌‌టైం మనీ ప్లాన్’ బుక్‌‌లో 50/30/20 బడ్జెట్​ రూల్‌‌ను పరిచయం చేశారు. దీనర్థం ఏంటంటే మన బడ్జెట్‌‌లో అవసరాలకు 50 శాతం, కోరుకున్నవాటికి 30 శాతం, సేవింగ్స్‌‌కు 20 శాతం కేటాయింపులు చేసుకోవాలి. కాగా ఈ రూల్ అంతర్జాతీయంగా పాపులర్​ అయ్యింది. ఈ థంబ్​ రూల్​ప్రకారం ..

  •   ట్యాక్స్​ తర్వాత మన ఆదాయంలో 50 శాతాన్ని మన అవసరాల కోసం వినియోగించాలి
  •   30 శాతం మనీని లగ్జరీ అవసరాలు, వస్తువుల కోసం కేటాయించాలి
  •   మిగిలిన 20 శాతం బడ్జెట్‌‌ను ఫైనాన్షియల్​ గోల్స్ కోసం పొదుపు చేసుకోవాలి.

చూడడానికి సింపుల్‌‌గా కనిపిసున్నప్పటికి దీనిని అనుసరించడం చాలా కష్టం.  అవసరాలను, లగ్జరీలను వేరుచేయడం  అంత సులువుకాదు. దీనికి సంబంధించి ఒకే విధమైన డెఫినేషన్​ ఉండదు.  ఒకరికి అవసరం అనుకున్నది మరొకరికి లగ్జరీ అవుతుంది.  మన ఆదాయం, బయట పరిస్థితులను అనుసరించి అవసరాలను, లగ్జరీల నుంచి వేరు చేసుకోవాలి. వ్యక్తిగతంగా ఇన్వెస్టర్ల గోల్స్, తమ ఆదాయానికి అనుగుణంగా మంచి ఫైనాన్షియల్​ ప్రణాళికను ఈ రూల్‌‌కు తోడుగా పాటించాలి. అందరికి తెలిసిన‘ఆదాయం మైనస్​ ఖర్చులు= సేవింగ్స్ ’ సూత్రాన్ని ‘ఆదాయం మైనస్​ సేవింగ్స్= ఖర్చులు’ గా మార్చుకోవాలి. లాంగ్​టర్మ్​ దృక్పథంతో ఉన్నవాళ్లు ఫైనాన్షియల్ ప్లాన్‌‌ను కచ్చితంగా అనుసరించాలి.  అయినప్పటికి మన వాళ్లతో మంచి మెమరీస్‌‌ను కూడా కోల్పోకూడదు.  దీనికి కొంత టైం, డబ్బు అవసరమవుతాయి. అందువలన లైఫ్‌‌లో  మంచి మెమరీస్​ కోసం ఖర్చు చేసే డబ్బుకు, భవిష్యత్​ కోసం దాచే సేవింగ్స్‌‌కు మధ్య మంచి బ్యాలెన్స్‌‌ను కొనసాగించాలి.

Latest Updates