ఢిల్లీ అల్లర్లు: ఐబీ ఆఫీసర్ పోస్టుమార్టంలో నమ్మలేని నిజాలు

కొన్ని రోజులుగా ఢిల్లీలో అల్లర్లు తీవ్రస్ధాయికి చేరాయి. ఇప్పటివరకూ అల్లర్ల వల్ల 38 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. రెండు రోజులు క్రితం ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ.. తన ఇంటికి కొంత దూరంలో ఉన్న ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఇంటి సమీపంలోని డ్రైనేజీలో శవమై దొరికాడు. అంకిత్ తన విధుల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత.. బయట పరిస్థితి ఎలా ఉందో చూసి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన వాడు చాంద్‌బాగ్‌లోని డ్రైనేజీలో శవమై తేలడంతో ఆయన కుటుంబసభ్యుల రోదన వర్ణనాతీతంగా ఉంది. అంకిత్ మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అంకిత్ మృతదేహానికి శవపరీక్ష చేసిన వైద్యులు.. ఆ రిపోర్టును చూసి షాక్‌కు గురయ్యారు. అంకిత్ శర్మను నలుగురైదుగురు దుండగులు గంటలపాటు హింసించి చంపారని తేల్చారు. అంకిత్ శరీరంపై చాలా లోతుగా దిగిన కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యుల బృందం తెలిపింది. కత్తిపోట్ల దాడికి అంకిత్ పేగులు కూడా తెగిపోయాయని వైద్యులు తెలిపారు. ఆ దుండగులు అంకిత్ శరీరంలో ఏ భాగాన్ని కూడా వదలకుండా పొడిచారని వైద్యులు నివేదించారు. పదునైన కత్తితో పొడిచి పొడిచి చంపారని వైద్యులు పేర్కొన్నారు. పోస్టుమార్టం చేసిన వైద్యులు తమ జీవితంలో ఇలాంటి హత్యను చూడలేదని అన్నారు.

అంకిత్ శర్మ 2017లో ఐబీలో ‘సెక్యూరిటీ అసిస్టెంట్’గా విధులలో చేరారు. అంకిత్ తండ్రి దేవేంద్ర శర్మ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అంకిత్ శర్మ హత్యకు ఆప్ నేత తాహిర్ హుస్సెన్ కారకుడని అంకిత్ తండ్రి దేవేంద్ర శర్మ ఆరోపిస్తున్నారు.

కాగా.. ఇప్పటికే అంకిత్ శర్మ హత్యకు సంబంధించి తాహిర్ హుస్సెన్‌పై ఐపీసీ 302 (ఎ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ తాహిర్ హుస్సెన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

For More News..

24 గంటల్లో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మృతి

స్విగ్గీ, జొమాటోలకు ధీటుగా.. ఫుడ్ డెలివరీలోకి అమెజాన్

మహిళలకోసం మహిళా వైన్ షాపులు

Latest Updates