అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనాతో మృతి?

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనాతో మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. 1994 నుంచి పాక్‌లో తల దాచుకుంటున్న దావూద్‌తో పాటు అతని భార్య మెహజబీన్ కరోనాతో బాధపడుతూ కరాచీ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు రెండు మూడు రోజులుగా వార్తలు వచ్చాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దావూద్ మృతి చెందాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పాక్‌కు చెందిన న్యూస్ ఎక్స్ అనే మీడియా దావూద్ మృతి చెందినట్టు శనివారం ఓ వార్త‌లో తెలిపింది.

అయితే ఈ వార్త‌ల‌ను దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం ఖండించాడు. దావూద్‌కు, అతని కుటుంబ సభ్యులకు ఎవ్వరికీ కరోనా పరీక్షలు నిర్వహించలేదని తెలిపాడు. ‌ దావూద్ ఇబ్రహీం ఆరోగ్యంగానే ఉన్నాడని, త‌మ కుటుంబం నుండి ఎవ్వరూ ఆసుపత్రిలో చేరలేదని తెలిపాడు.

COVID-19 తో దావూద్ ఇబ్రహీం బాధపడుతున్నాడ‌ని సోషల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లను పాక్ అధికారిక వ‌ర్గాలేవీ ప్ర‌క‌టించ‌లేదు. మీడియా ఛానెళ్లు కూడా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో ఈ వార్త రూమ‌రే అని అంటున్నారు.

Latest Updates